బాలల దినోత్సవ విజేతలకు బహుమతి ప్రదానం

  |   Telugunews

వేటపాలెం, : స్దానిక లలిత కళాసమితి ఆద్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సంధర్బంగా ఈ నెల 9వ తేదీన బండ్ల బాపయ్య హిందూ జూనియర్‌ కళాశాలలో వివిధ పోటీలను నిర్వహించారు. విజేతలకు బహు మతి ప్రధానం తోపాటు , విచిత్ర వేషధారణ పోటీలు, భారత సాంప్రదాయ నృత్య పోటీలు నిర్వహించారు. 6వతరగతి విద్యార్దిని గుత్తి బాల సుహైల హన్షిని వీరనారి ఝాన్సి లక్ష్మీ బాయి ఏకపాత్ర ఆహుతలను ఆకట్టుకుంది పోటీలలోని విజేతలకు సమితి

గౌరవాద్యక్షులు సత్రం మల్లేశ్వరరావు అద్యక్షత వహించిన కార్యక్రమంలో బహుమతులు అందచేశారు. స్దానిక జిల్లాపరిషత్‌ ఉన్నతపాఠశాలలో , బండ్ల బాపయ్య హిందూ జూనియర్‌ కళాశాలలోని హైస్కూల్‌ విభాగంలో, జూనియర్‌ ఇంటర్‌, సీనియర్‌ ఇంటర్‌ పరీక్షలలో ప్రతిభ చూపిన విద్యార్దులకు ప్రోత్సాహక నగదు బహుమతులు అంద చేశారు. వివిధ రంగాలలో ప్రతిభ కనబరచిని 8 మందిని సన్మానించారు. కార్యక్రమంలో కోడూరి ఏకాంబరేశ్వరబాబు, మొదలి గోపాల కృష్ణయ్య, బి. వీర ప్రసాదరావు , కె.నాగమాంబ, స్వర్ణ ప్రయాగరావు వల్లంపట్ల మురళీకృష్ణమూర్తి, దంతం వెంకట సుబ్బారావు, గౌరాబత్తుని రవి బాబు, వివి సుబ్బారావు, ఎం.బ్రహ్మనందరెడ్డి, కెవిడి మల్లి కార్జునరావు, ప్రత్తి వెంకట సుబ్బారావు, కొర్నెపాటి వీరనాగులు, రామిశెట్టి నరశింహారావు పాల్గొన్నారు.

ఫోటో - http://v.duta.us/Tcj-JQAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/xWgvOQAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬