బాల ల్లోని అద్భుత మేధస్సును వెలికితీయాలి

  |   Telugunews

కందుకూరు : మనదేశ భవిష్యత్తుకు మూలస్థంభాల్లాంటి నేటి బాల బాలికలను రేపటి ఉత్తమ భావిపౌరులుగా తీర్చిదిద్దగలిగితేనే బంగారు భవిష్యత్తు భారతదేశానికి సాక్షాత్కారమవుతుందని సీనియర్‌ సివిల్‌జడ్జి యం.నాగేశ్వరరావు ఉద్భోధచేశారు. బాలల దినోత్సవం సందర్భంగా పట్టణంలోని సాంఘిక సంక్షేమ శాఖ ఎస్సీ బాలికల హాస్టల్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయ విజ్ఞాన సదస్సును కూడా నిర్వహించారు. నేటి బాల బాలికల్లో నైతిక విలువలను పెంపొందించి విజ్ఞాన వంతులుగా తీర్చిదిద్దాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. అందుకు బోధనచేసే ఉపాధ్యాయులు, వసతి గృహాలను పర్యవేక్షించే అధికారులు బాధ్యత వహించాలని అన్నారు. అంకిత భావంతో విద్యార్ధినీ విద్యార్ధులను తీర్చిదిద్దిననాడు మనదేశం అద్భుతమైన ప్రగతి మార్గంలో పయనిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. బాలి బాలికల్లోని మేధస్సును వెలికితీయగలిగినప్పుడే దేశ ప్రగతికి దోహదపడే అద్భుత ఫలితాలను సాదించగలుగుతామని అన్నారు. గొప్ప మేధావిగా, స్పూర్తి ప్రదాతగా ప్రఖ్యాతిగాంచిన మనదేశ రాష్ట్రపతిగా సేవలందించిన మహనీయుడు ఏ.పి.జె.అబ్దుల్‌ కలాం బాల బాలికల్లోని ప్రతిభను పెంపొందించేందుకు ఎనలేని కృషిచేశారని అన్నారు. నేటి బాలి బాలికల్లో అలాంటి మహనీయ ప్రతిభాసంపన్నులు మరెందరో ఉండొచ్చని ఆశాభావం వ్యక్తంచేశారు. వారిని గుర్తించి, ప్రోత్సహించగలిగినప్పుడే అద్భుత ఫలితాలు సాక్షాత్కారమవుతాయని, భారతదేశ ప్రతిష్ట ఎంతగానో ఇనుమడిస్తుందని హితబోద చేశారు. ఈ కార్యక్రమంలో జూనియర్‌ సివిల్‌ జడ్జి యం.బాబు, కందుకూరు బార్‌ అసోసియేషన్‌ కార్యదర్శి ఎస్‌. పవన్‌కుమార్‌తోపాటు హాస్టల్‌ వార్డెన్‌ డి.దుర్గాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

ఫోటో - http://v.duta.us/nrxPnQAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/cgwiJwAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬