భవన నిర్మాణ కార్మికులకు జనసేన అన్నసమారాధన..

  |   Telugunews

మండపేట:-ఇసుక కొరత వల్ల పనులు లేక భవన నిర్మాణ కార్మికులు అల్లాడిపోతున్నారని మండపేట నియోజకవర్గ జనసేనా ఇంచార్జ్ వేగుళ్ళ లీలా కృష్ణ పేర్కొన్నారు.పార్టీ అధినేత పవన్ ఆదేశాల మేరకు శుక్రవారం స్థానిక కలవపువ్వు సెంటర్ లోని మునిసిపాలిటీ వద్ద డొక్కా సీతమ్మ అన్న సమరాధన కార్యక్రమం నిర్వహించారు. భవన నిర్మాణ కార్మికుల కు సంఘీభావం తెలిపేందుకు ఈ కార్యక్రమన్నీ నిర్వహించినట్లు తెలిపారు. భవన నిర్మాణ కార్మికుల సంఘం అధ్యక్షులు షేక్ ఇబ్రహీం, బిజెపి నియోజకవర్గ కన్వీనర్ కోన సత్యనారాయణ, జన సేన నాయకులు మర్రెడ్డి శ్రీనివాసరావు, ఉండమట్ల రామారావు లతో కలిసి ఈ కార్యక్రమన్నీ ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

జిల్లాలో కొత్తగా నిర్మాణం చేపట్టే భవన నిర్మాణలు నిలిచిపోయాయన్నారు. అరకొరగా భవన నిర్మాణాలకు సంబంధించి మరమ్మతు పనులే స్థానిక కార్మికులకు జీవనోపాధిగా మారాయని పేర్కొన్నారు. గత కొన్ని నెలలుగా పూర్తిగా ఇసుక రవాణా నిలిచి పోవడంతో ఎక్కడా భవన నిర్మాణాలకు సంబంధించి పనులు దొరికే పరిస్థితి లేకుండాపోయిందని వాపోయారు. వేలాది మంది తాపీమేస్త్రీలు, హెల్పర్లు, కేవలం భవన నిర్మాణ పనుల పైనే ఆధారపడి ఉన్నారన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పనులు లేకపోవడంతో పస్తులు ఉండే దుస్థితి ఏర్పడిందన్నారు. వేరే పనులకు వెళ్లలేక ఇంట్లో పూట గడవకపోవడంతో వలస బాట పడుతు న్నారని ఆవేదన వ్యక్తంచేశారు.ఇప్పటికే చాలామంది కార్మికులు తెలంగాణ,ఒరిస్సా లోని పలు ప్రాంతాలకు వెళ్ళి పనులు చేస్తున్నారని పేర్కొన్నారు.ఇదే సమయంలో వారికి పనులు ప్రతీరోజు దొరకని పరిస్థితి ఏర్పడిందన్నారు. వారంలో రెండు, మూడు రోజల కంటే తెలంగాణలోనూ పనులు దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కువ రోజులు పని ఉందంటే మకాం వెళ్ళడానికి సిద్ధమవుతున్నారన్నారు. పదిహేను రోజుల నుంచి నెల రోజుల పాటు అక్కడే ఉండి పనులు చేసు కోవడానికి వలస వెళ్తున్నారన్నారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులను ఇళ్ల వద్దే వదిలి 10 నుంచి 20 మంది తాపీమేస్త్రీలు కలిసి ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారన్నారు. ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడు ఎదురుకాలేదన్నారు.నియోజకవర్గంలో కొరిమిల్లి వద్ద ఉన్న ఇసుక నిల్వలు అధికార పార్టీ రాత్రికి రాత్రే వైజాగ్ తరలించడం పై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉప ముఖ్యమంత్రి, స్థానిక టీడీపీ ఎమ్మెల్యే ఇద్దరూ ఓకేటనని,కేవలం ప్రజలను మభ్య పెట్టేందుకు ఒకరినొకరు విమర్శలు చేసుకుంటూ ప్రజలను మోసాగిస్తున్నారని దుయ్యబట్టారు. ఇక్కడి నిల్వ లు వేరే ప్రాంతానికి తరలి పోతే బాధ్యత గల వీరిరువు ఎం చేస్తున్నట్టని ప్రశ్నించారు. పంచాయతీ ఒప్పందం పారిశుద్ధ్య కార్మికులు శిబిరానికి చేరుకొని తమ సంఘీభావం తెలిపారు. ఈ సంఘం నాయకులు మగ్గం రాంబాబు తదితరులు లీలా కృష్ణ కు మద్దతు తెలిపి, సహపంక్తి భోజనాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జన సేన నాయకులు మండా వీరభద్రరావు, పొలమురి విజయ్, గోళ్ళ శ్రీను, కొంతం ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

ఫోటో - http://v.duta.us/wUwiHAAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/V9PQZwAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬