రూ.60 కే లీటర్‌ డీజిల్‌ ఇస్తానని 43వేలతో ఉడాయించిన ఘనుడు

  |   Telugunews

పొదిలి, :60 రూ.లకే డీజిల్‌ ఇస్తానని రైతుల వద్ద నుండి 43 వేల రూపాయలు తీసుకుని ఉడాయించిన సంఘటన స్థానిక దర్శి రోడ్డులో గల శ్రీరామ ఆయిల్‌ ఫిల్లింగ్‌ స్టేషన్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే మండలంలోని గురుగుపాడు గ్రామంలో నడికుడి శ్రీకాళహస్తి రైల్వేలైన్‌ కాంట్రాక్టర్‌ అని రైతులను నమ్మించి మాకు డీజిల్‌ కంపెనీ నుండి తక్కువ రేటుకే డీజిల్‌ వస్తుందని కంపెనీ వద్ద ప్రతీనెలా కొనాల్సి రావడంలో డీజిల్‌లో 1000 లీటర్లు మిగులుతుందని అందువల్ల డీజిల్‌ 60 రూ.లకు అమ్ముతున్నామని చెప్పి గురుగుపాడు గ్రామంలోని రైతులందరిని దర్శి రోడ్డులో గల ఆయిల్‌ ఫిల్లింగ్‌ స్టేషన్‌ వద్దకు పిలిపించి 735 లీటర్ల డీజిల్‌ను కొట్టించి రైతుల వద్ద నుండి 43వేల రూపాయలు వసూలు చేసి ఇప్పుడే వస్తానని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు. దీంతో మోసపోయామని గుర్తించిన రైతులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని జరిగిన తీరును పరిశీలించి సిసి కెమెరా పుటేజీలను పరిశీలించారు. ఫిల్లింగ్‌ స్టేషన్‌ యజామాని డీజిల్‌ నగదు చెల్లించాలని రైతులను అడుగగా నగదు మొత్తం అతనికే ఇచ్చామని తెలిపారు. దీంతో నగదు ఇవ్వనిదే డీజిల్‌ క్యాన్ల ఆటోను పంపనని నిర్బంధించారు. దీంతో రైతులు లబోదిబోమన్నారు.

ఫోటో - http://v.duta.us/3albHAAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/wCc5vAAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬