లీలా కృష్ణ తో సిఐ వాగ్వాదం

  |   Telugunews

మండపేట : మునిసిపాలిటీ ఎదుట జనసేన ఆధ్వర్యంలో ఆ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ వేగుళ్ళ లీలా కృష్ణ నేతృత్వంలో చేపట్టిన భవన నిర్మాణ కార్మికుల డొక్కా సీతమ్మ అన్న సమరాధన శిబిరం వద్ద ఉత్కంఠ పరిస్థితి ఏర్పడింది. టెంట్ లు ఏర్పాటు చేసి భవన నిర్మాణ కార్మికుల కోసం భోజనాలు ఏర్పాటు చేశారు. అయితే మధ్యాన్నం టౌన్ సిఐ అడపా నాగ మురళి అక్కడి చేరుకున్నారు. టెంట్ లు రోడ్డు కు అడ్డుగా ఉందని ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందని సిఐ పేర్కొన్నారు. దీంతో లీలా కృష్ణ మాట్లాడుతూ... భవన నిర్మాణ కార్మికుల కు సంఘీభావం తెలిపేందుకు మాత్రమే టెంట్ లు ఏర్పాటు చేసి బోజనాలను పెడుతున్నామని చెప్పారు. ఇలా మాట్లాడుతూ ఒక్కసారిగా ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఇక్కడ కలవపువ్వు సెంటర్ లో అడ్డుగా ఉన్న కటావుట్ లు తొలగించారా అంటూ లీలా ప్రశ్నించారు. దీనికి సిఐ మాట్లాడుతూ... అది పురపాలక సంఘం అధికారుల డ్యూటీ అన్నారు. దీనిపై వాగ్వివాదం పెరిగింది. ఈ లోగా జన సైనికులు గుమిగూడటం తో ఉత్కంఠ త నెలకొంది. ఈ దశలో జన సేన నాయకులు మర్రెడ్డి శ్రీనివాసరావు కల్పించుకొని ఇద్దరికి సర్ది చెప్పారు.

ఫోటో - http://v.duta.us/kpXKNAAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/h1_MEwAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬