అన‌సూయ అలా దూసుకెళ్తుంద‌న్న‌మాట‌.. జ‌బ‌ర్ద‌స్త్ బ్యూటీ దూకుడు..💃

  |   Tollywood

ఎలా మొద‌లుపెట్టాం అనేది కాదు.. ఎలా ముగిస్తాం అనేది ఇక్క‌డ ఇంపార్టెంట్. ఏ ఆట‌లో అయినా కూడా మొద‌లు ముఖ్యం కాదు.. పూర్తి చేయ‌డ‌మే ప్ర‌ధానం. ఇప్పుడు అన‌సూయ కూడా ఇదే చేస్తుంది. యాంక‌ర్ కంటే ముందు చిన్న చిన్న పాత్ర‌ల‌తో కెరీర్ మొద‌లుపెట్టింది అన‌సూయ‌. ఒక‌టి రెండు కాదు.. దాదాపు 15 ఏళ్ల కిందే ఇండ‌స్ట్రీకి వ‌చ్చింది కానీ గుర్తింపు తెచ్చుకోడానికి చాలా ఏళ్లు ప‌ట్టింది. ఓ టీవీ ఛానెల్లో యాంక‌ర్‌గా కూడా చేసింది. ఆ త‌ర్వాత జ‌బ‌ర్ద‌స్త్ కార్య‌క్ర‌మం ఈ భామ జాత‌కాన్ని మార్చేసింది.

ఆ మ‌ధ్య క్ష‌ణం సినిమాలో విల‌న్ పాత్ర‌లో ర‌ప్ఫాడించింది. ఆ త‌ర్వాత రంగ‌మ్మ‌త్త‌గా తెలుగు ప్రేక్ష‌కుల‌కు గుర్తుండిపోయింది. మొన్న విడుద‌లైన యాత్ర‌లో కూడా ఒక్క సీన్ చేసినా కూడా గుర్తుండిపోయేలా న‌టించింది. ఆ ఒక్క సీన్ లోనే తన‌లో ఎంత మంది న‌టి ఉందో గుర్తు చేసింది ఈ ముద్దుగుమ్మ‌. తాను కేవ‌లం అందాల ఆర‌బోత‌కు మాత్ర‌మే కాదు.. న‌టిగా కూడా ప‌నికొస్తాన‌ని ప్ర‌తీసారి గుర్తు చేస్తూనే ఉంది అన‌సూయ‌.

ఇప్పుడు ఆమె కోస‌మే ప్ర‌త్యేకంగా పాత్రలు రాసే స్థాయికి అన‌సూయ న‌ట‌న ఎదిగింది. ఇప్పుడు కూడా విజ‌య్ దేవ‌ర‌కొండ నిర్మాత‌గా మారి చేస్తున్న సినిమాలో త‌రుణ్ భాస్క‌ర్‌తో క‌లిసి న‌టించ‌బోతుంది అన‌సూయ‌. మొత్తానికి ఈమె దూకుడు చూస్తుంటే ఓ వైపు యాంకరింగ్.. మ‌రోవైపు న‌టిగా ర‌ప్ఫాడించ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.

పూర్తి ఆర్టికల్ ఇక్కడ చూడండి -http://v.duta.us/cUzHRAAA

📲 Get Tollywood on Whatsapp 💬