ఎన్టీఆర్‌ను వర్మనే కాదు.. సూర్య కూడా వాడేసాడుగా..😵

  |   Tollywood

అవును ఇపుడు తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్‌ హాట్ సబ్జెక్ట్‌గా మారాడు. ఎవరి స్టైల్లో వాళ్లు ఎన్టీఆర్‌ను ఎలా పడితే అలా వాడేసుకుంటున్నారు. ఇప్పటికే ఆయన తనయుడు బాలకృష్ణ..‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమాను తెరకెక్కించాడు. కథానాయకుడు రిలీజై అంతగా ప్రేక్షకాదరణ పొందక పోయిన త్వరలోనే మహానాయకుడుగా రాబోతున్నాడు.

మరోవైపు సూర్య కూడా ఎన్టీఆర్‌ను తన కొత్త సినిమా NGK కోసం వాడుకున్నాడు. వాలెంటైన్స్ డే సందర్బంగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు. పూర్తి రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఎన్టీఆర్‌ను ఫుల్లుగా వాడుసుకున్నాడు.

ఎన్జీకే టైటిల్ విషయానికొస్తే..‘నంద గోపాల కృష్ణన్’ అనే టైటిల్ తమిళంలో ఉంటే తెలుగులో మాత్రం ‘నంద గోపాల కృష్ణ’గా వస్తున్నాడు. శ్రీ రాఘవ డైరెక్ట్ చేసిన ఈ సినిమా పూర్తిగా పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కించినట్టు కనబడుతోంది. ఈ సినిమాలో సూర్య సరసన రకుల్ ప్రీత్ సింగ్, సాయి పల్లవి హీరోయిన్స్‌గా నటించారు. మొత్తానికి ఎన్టీఆర్ బొమ్మ పెట్టుకొని బాక్సాఫీస్ దగ్గర NGK ఎలాంటి మెరుపులు మెరిస్తాడో చూడాలి.

పూర్తి ఆర్టికల్ ఇక్కడ చూడండి -http://v.duta.us/nXjr9QAA

📲 Get Tollywood on Whatsapp 💬