చిక్కుల్లో పవన్ కల్యాణ్ హీరోయిన్... బాలీవుడ్ హాట్ హీరోయిన్‌పై ఛీటింగ్ కేసు...😱

  |   Tollywood

పవన్ కల్యాణ్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన మొదటి బ్లాక్ బస్టర్ మూవీ ‘బద్రీ’. ఈ సినిమాలో సరయుగా, ప్రకాశ్ రాజ్ చెల్లెల్లిగా నటించిన బాలీవుడ్ బ్యూటీ అమీషా పటేల్. ఆ సినిమా వచ్చి 19 ఏళ్లు గడిచిపోయినా... ఇప్పటికీ హాట్ ఫోటోషూట్లతో కుర్రాళ్ల మతులు పొగొడుతూనే ఉంది అమీషా పటేల్. 42 ఏళ్ల వయసులోనూ అందాల ఆరబోతకు ఎలాంటి హద్దులు పెట్టుకోని ఈ సీనియర్ మోస్ట్ హీరోయిన్... సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు పెడుతూ అభిమానులను అలరిస్తూ ఉంటోంది. ‘

హాట్ ఆంటీ’గా నెటిజన్స్ గుర్తింపు పొందిన అమిషా తాజాగా అనుకోని చిక్కుల్లో ఇరుక్కుంది. ఓ పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తానని చెప్పి, డబ్బులు తీసుకుని... వెడ్డింగ్‌కు కూడా రాకుండా ఎగొట్టిందని అమీషాపై ఛీటింగ్ కేసు నమోదు చేశాడో ఈవెంట్ మేనేజర్.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొరదాబాద్ సిటీలో ‘డ్రీమ్ విజ్డమ్’ అనే ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ నడుపుతున్న పవన్ శర్మ అనే వ్యక్తి... కొన్నాళ్ల కిందట అమీషాను కలిసి... ఓ పెళ్లివేడుకలో డ్యాన్స్ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇందుకు అడ్వాన్స్‌గా ఆమెకు రూ.11 లక్షలు కూడా చెల్లించాడు. అయితే డబ్బులు తీసుకున్న తర్వాత అమీషా... సమయానికి పెళ్లికి రాలేదు. ఏమైందని అడిగితే... మరో రూ.2 లక్షలు ఇవ్వాలని, ఎక్స్‌ట్రా పేమెంట్ చేస్తేనే వస్తానని డిమాండ్ చేసింది.

‘బద్రీ’ సినిమా సూపర్ హిట్ తర్వాత మహేష్ బాబు సరసన ‘నాని’ సినిమాలో నటించింది అమీషా పటేల్. ప్రయోగాత్మక చిత్రంగా వచ్చిన ‘నాని’ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా మిగిలింది. ఆ తర్వాత జూనియర్ ఎన్.టీ.ఆర్ సరసన ‘నరసింహుడు’, నందమూరి బాలకృష్ణ సరసన ‘పరవవీరచక్ర’ సినిమాలోనూ నటించింది. అయితే ఈ సినిమాలేవీ బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించలేకపోయాయి.

పూర్తి ఆర్టికల్ ఇక్కడ చూడండి -http://v.duta.us/FMu9zAAA

📲 Get Tollywood on Whatsapp 💬