చివరకు మోహన్ బాబు కూడా ఎన్టీఆర్ ని...! 😵

  |   Tollywood

రామ్ గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' తెరకెక్కిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కూడా ఎన్టీ రామారావు జీవితంలో చివరి రోజుల గురించి మాట్లాడుకుంటున్నారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ లో లక్ష్మీ పార్వతిని ఎన్టీఆర్ పెళ్లి చేసుకున్న తర్వాత పడ్డ క్షోభ - కుటుంబ సభ్యుల నుండి ఎదుర్కొన్న విమర్శలు - అధికారం బలవంతంగా లాగేసుకోవడం చూపించారు.

ఎన్టీఆర్ కు మోహన్ బాబు అప్పట్లో చాలా సన్నిహితుడిగా - ఆప్తుడిగా ఉండే వారు. ఎన్టీఆర్ సూచన మేరకు మోహన్ బాబు రాజకీయాల్లోకి వెళ్లాడు. అయితే వెన్ను పోటు సమయంలో ఎన్టీఆర్ ను మోహన్ బాబు కూడా విడిచి వెళ్లాడని - ఆ సమయంలో చంద్రబాబు నాయుడుకు మద్దతుగా మోహన్ బాబు నిలిచాడు అంటూ లక్ష్మీ పార్వతి చెప్పుకొచ్చింది. కొన్నాళ్ల తర్వాత అన్నగారికి అన్యాయం చేశాను అంటూ వచ్చి క్షమాపణలు చెప్పాడు.

ఇక మా పెళ్లి గురించి చెప్పేందుకు రెండు మూడు సార్లు కుటుంబ సభ్యుల మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ సమయంలో అంతా కూడా ఆయనకు వ్యతిరేకంగానే మాట్లాడారు. ఆరోగ్యం సరిగా లేని నాకు ఈ సమయంలో భార్య అవసరం ఉందని చెప్పే ప్రయత్నం చేశారు. కాని వారు ఎవరు కూడా ఒప్పుకోలేదు. వారి అమాయకత్వంను ఆసరాగా చేసుకుని చంద్రబాబు నాయుడు ఆయన్ను వెన్ను పోటు పొడిచాడు.

అమాయకత్వంతో వారు చేసినా కూడా అది చాలా పెద్ద తప్పు. ఈ విషయాలన్నింటికి కూడా వర్మ తన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో చూపిస్తాడని ఆశిస్తున్నాను. ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో ఆయనపై జనాల్లో ఇంకా అభిమానం ఉందని నిరూపితం అయ్యిందని లక్ష్మీ పార్వతి అన్నారు.

పూర్తి ఆర్టికల్ ఇక్కడ చూడండి -http://v.duta.us/1t0XugAA.

📲 Get Tollywood on Whatsapp 💬