జనసేన గూటికి రామ్ చరణ్.. సిద్ధమవుతున్న మెగా వారసుడు..🤝

  |   Tollywood

రాజ‌కీయాలు ఆస‌క్తి లేదంటూనే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు బాగానే స‌పోర్ట్ చేస్తున్నాడు రామ్ చ‌ర‌ణ్. బాబాయ్ అడ‌గాలే కానీ అన్నీ వ‌దిలేసి మ‌రి రాజ‌కీయ ప్ర‌చారం చేయ‌డానికి సిద్ధ‌మే అని ఇదివ‌ర‌కే చెప్పాడు మెగా వార‌సుడు. ఇప్పుడు ఆయ‌న అడ‌క్క‌పోయినా కూడా అబ్బాయి మాత్రం బాబాయికి ఫుల్ స‌పోర్ట్ చేస్తున్నాడు. సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌చారం చేస్తున్నాడు. ఆ మధ్య పవ‌న్ క‌ళ్యాణ్ కోసమే రిప‌బ్లిక్ డే కానుక‌గా ప్ర‌త్యేకంగా ఓ పాట‌ను రాయించి డిజైన్ చేయించాడు రామ్ చ‌ర‌ణ్.

బాబాయ్ వెంట ఉన్న ల‌క్ష‌లాది ప్ర‌జ‌ల‌కు గుర్తుగా ఈ పాట అంటూ ఫేస్ బుక్‌లో పోస్ట్ చేసాడు మెగా హీరో. ఈ పాట బాగానే వైర‌ల్ అయింది కూడా. ఒక‌డొచ్చాడు అంటూ సాగే ఈ పాట‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ విజువ‌ల్స్ బాగా హైలైట్ చేసారు. జ‌న‌సేన పార్టీని.. వాటి లక్ష్యాల‌ను పూర్తిగా హైలైట్ అయ్యేలా ఈ పాట‌ను రాయించాడు రామ్ చ‌ర‌ణ్. పార్టీ ప్ర‌చారానికి కూడా ప‌నికొచ్చేలా ఉంది ఈ పాట‌.

మొత్తానికి లేదు లేదు అంటూనే వ‌ర‌స‌గా మెగా కుటుంబం అంతా ఇప్పుడు ప‌వ‌న్ వెంటే న‌డుస్తున్నారు. వ‌ద్ద‌న్నా కూడా ప‌వ‌ర్ స్టార్ కోసం అంతా క‌లిసి ప‌ని చేసేలా క‌నిపిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క పాత్ర పోషించ‌బోతున్నాడ‌ని ఇప్పుడు సీన్ చూస్తుంటే అర్థం అయిపోతుంది. తాజాగా మరోసారి కూడా రామ్ చరణ్ తన అడుగులు జనసేన వైపే వేయాలని చూస్తున్నాడు. మ‌రి దీనికి మెగా హీరోల ప్ర‌చారం ఎంత‌వ‌ర‌కు ప‌నికొస్తుందో చూడాలి.

పూర్తి ఆర్టికల్ ఇక్కడ చూడండి -http://v.duta.us/DHUp2AAA

📲 Get Tollywood on Whatsapp 💬