న‌గ్మా అభిమానుల‌కు గుడ్ న్యూస్.. రీ ఎంట్రీ ఎప్పుడో తెలుసా..?👌

  |   Tollywood

న‌గ్మా.. ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. ఒక‌ప్పుడు తెలుగుతో పాటు త‌మిళ్, హిందీ, భోజ్ పురి ఇండ‌స్ట్రీల‌ను దున్నేసిన హీరోయిన్. దానికి తోడు ఇండియ‌న్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ సౌర‌వ్ గంగూలీ రిలేష‌న్ షిప్‌తో కూడా కొన్నాళ్లు ఫేమ‌స్ అయింది న‌గ్మా. కొన్నేళ్లుగా సినిమాల‌కు దూరంగా ఉంది ఈ ముద్దుగుమ్మ‌. రాజ‌కీయాల్లో బిజీ కావాల‌ని చూస్తుంది. అస‌లు కొన్ని రోజులుగా క‌నిపించ‌డం కూడా మానేసిన ఈమె.. ఈ మ‌ధ్యే ఓ కార్య‌క్ర‌మానికి వ‌చ్చింది. టిఎస్సార్ అవార్డ్స్ వేడుక‌లో ఈమెకు లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్ అవార్డు ఇచ్చారు.

అయితే ప్ర‌స్తుతం త‌న ఫోక‌స్ మొత్తం రాబోయే ఎన్నికల్లో లోక్‌సభకు పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు చెప్పింది నగ్మా. సామాజిక సేవ చేస్తున్న త‌న‌కు రాజీవ్ గాంధీ అవార్డు కూడా వ‌చ్చింద‌ని గుర్తు చేసుకుంది ఈ సీనియ‌ర్ హీరోయిన్. ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డును అందుకోవడం చాలా ఆనందంగా ఉందంటుంది న‌గ్మా. మార్చ్ లో ఈ అవార్డ్ త‌న‌కు అంద‌చేస్తార‌ని చెబుతుంది న‌గ్మా. మ‌రి రీ ఎంట్రీ ఇస్తే.. ఎలాంటి సినిమా చేయ‌బోతుందో.. వ‌స్తే మ‌ళ్లీ స‌క్సెస్ అవుతుందో లేదో చూడాలిక‌.

పూర్తి ఆర్టికల్ ఇక్కడ చూడండి -http://v.duta.us/wM_yLwAA

📲 Get Tollywood on Whatsapp 💬