నాగార్జునతో అక్కినేని అమల.. శివ కాంబినేషన్ రిపీట్...👫

  |   Tollywood

నిజ జీవిత భాగస్వాములైన నాగార్జున, అమల ‘నిర్ణయం’ సినిమా తర్వాత ఒక నిర్ణయానికి వచ్చి ఒకింటి వాళ్లు అయ్యారు. ‘నిర్ణయం’ తర్వాత వీళ్లిద్దరు మళ్లీ కలిసి నటించలేదు. మధ్యలో అమల కొన్ని సినిమాల్లో యాక్ట్ చేసిన నాగ్‌తో కలిసి నటించే అవకాశం రాలేదు.

కానీ ఈ రియల్ లైఫ్ జంట మరో సినిమాలో కలిసి నటించే అవకాశాలున్నయని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం నాగార్జున..రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ‘మన్మథుడు’ సినిమాకు సీక్వెల్‌గా ‘మన్మథుడు 2’ సినిమా చేయడానికి ఒకే చెప్పాడు.

ఈ సినిమాలో నాగార్జున సరసన పాయల్ రాజ్‌పుత్‌ను ఒక హీరోయిన్‌గా అనుకుంటున్నారు. మరోవైపు ఈ సినిమాలో అమల కూడా ఒక కథానాయికగా నటించే అవకాశాలున్నాయని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఇది నిజమైతే పెళ్లి తర్వాత నాగార్జున, అమల జంటగా నటించే సినిమా ఇదే అవుతుంది. మరోవైపు అక్కినేని అభిమానులు కూడా వీళ్లిద్దరినీ వెండితెరపై జోడిగా చూడాలనుకుంటున్నారు. మరి వారి ఆశలను వీళ్లిద్దరు నిలబెడతారా లేదా అనేది చూడాలి.

పూర్తి ఆర్టికల్ ఇక్కడ చూడండి -http://v.duta.us/ErzkugAA

📲 Get Tollywood on Whatsapp 💬