నాని కృతజ్ఞత ఖర్చు రూ 35 కోట్లు. 😎

  |   Tollywood

ప్రస్తుతం గౌతమ్ డైరెక్షన్లో జెర్సీ చిత్రం తో వస్తున్నాడు.ఇదిలా ఉంటె తనకు పూర్వ వైభవం ఇచ్చిన డైరెక్టర్ కు కృతజ్ఞత చెప్పేందుకు ఏకంగా రూ. 35 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇంతకీ ఎవరికీ తెలుసా డైరెక్టర్ మారుతీ కి. ఓ దశలో నాని కి వరుస ప్లాపులు వస్తూ ఆయన తో సినిమాలు చేసేందుకు నిర్మాతలు భయపడే సమయంలో భలే భలే మగాడివోయ్ చిత్రాన్ని ఇచ్చి నాని కెరీర్ని మళ్లీ గాడిలో పెట్టిన డైరెక్టర్ మారుతీ. అప్పటి నుండి 2017 లో వచ్చిన MCA చిత్రం వరకు అన్ని హిట్లే కొట్టాడు.

ఇక మారుతి సైతం శైలజారెడ్డి అల్లుడుతో డిజాస్టర్ ను అందుకున్నాడు. దీంతో ఆయనతో సినిమాలు చేసేందుకు హీరోలు వెనకడుగు వెతున్నారట. దీంతో తనకు లైఫ్ ఇచ్చిన మారుతిని ఆదుకునేందుకు నాని ఆయన డైరెక్షన్లో ఓ సినిమా చేసేందుకు డిసైడ్ అయ్యాడట. కేవలం చేయడమే కాదు ఆ సినిమాను నిర్మాత గా కూడా వ్యవహరిస్తున్నాడట. ఈ సినిమా కు రూ. 35 కోట్ల ఖర్చు పెట్టేందుకు నాని సిద్ధమయ్యాడని తెలుస్తుంది. మరి నాని కి మరోసారి మారుతీ హిట్ ఇస్తాడా లేదా అనేది చూడాలి.

పూర్తి ఆర్టికల్ ఇక్కడ చూడండి -http://v.duta.us/NaPdRQAA

📲 Get Tollywood on Whatsapp 💬