పాత పరిచయాలు వాడుకుంటున్న రకుల్ 🤝

  |   Tollywood

రెండేళ్ల కిందట రకుల్ ప్రీత్ సింగ్ ఊపు చూసి ఏమో అనుకున్నారు. వరుసగా పెద్ద పెద్ద స్టార్లతో సినిమాలు చేస్తూ.. పోటీలో ఉన్న హీరోయిన్లందరినీ వెనక్కి నెట్టేస్తూ టాలీవుడ్ నంబర్ వన్ హీరోయిన్ కిరీటాన్ని చేజిక్కించుకున్నట్లే కనిపించిందామె. కానీ ఉన్నట్లుండి ఆమె ఫేట్ మారిపోయింది. వరుస ఫ్లాపులతో రేసులో వెనుకబడింది. నంబర్ వన్ హీరోయిన్ లాగా కనిపించినప్పటి నుంచి ఏడాది తిరిగేలోపే చేతిలో ఒక్క సినిమా కూడా లేకుండా ఖాళీ అయ్యే స్థితికి చేరుకుంది.

గత ఏడాదంతా తెలుగులో రకుల్ సినిమా ఒక్కటంటే ఒక్కటి రిలీజ్ కాలేదు. ఆమెకు ఛాన్సులిచ్చేవాళ్లే కరవయ్యారు. తాజాగా రకుల్ డబ్బింగ్ మూవీ ‘దేవ్’తో పలకరించింది. అది కూడా డిజాస్టర్ అని తేలిపోయింది. ఇక ఆమెకు ఛాన్సులు రావడం మరీ కష్టమైపోయేలా ఉంది. ఐతే టాలీవుడ్లో వ్యక్తిగతంగా కూడా మంచి పేరు సంపాదించిన రకుల్.. తనకున్న పాత పరిచయాలతో ఛాన్సులు అందుకునే ప్రయత్నంలో ఉంది.

నాగచైతన్య కెరీర్ లో మరపురాని సినిమాగా నిలిచిన ‘రారండోయ్ వేడుక చూద్దాం’ విజయంలో రకుల్ పాత్ర కీలకం. ఆ సినిమా సక్సెస్ కు తోడ్పడిందన్న కారణంతో చైతూ ‘వెంకీ మామ’లో ఛాన్స్ ఇప్పించాడు. ఇక తాను మాంచి ఫాంలో ఉండగా.. బెల్లంకొండ శ్రీనివాస్ రేంజ్ చూడకుండా అతడితో కలిసి ‘జయ జానకి నాయక‘ చేసినందుకు ప్రతిఫలంగా అతడి కొత్త సినిమాలోనూ రకుల్ అవకాశం అందుకున్నట్లు సమాచారం. మరి ఈ పాత పరిచయాలతో ఇంకెన్ని ఛాన్సులొస్తాయో చూడాలి.

పూర్తి ఆర్టికల్ ఇక్కడ చూడండి -http://v.duta.us/kaX9xAAA

📲 Get Tollywood on Whatsapp 💬