‘మహర్షి’ తర్వాత మహేష్ మరోసారి ఆ నిర్మాతకే ఓకే చెప్పాడా...🤗

  |   Tollywood

‘భ‌ర‌త్ అనే నేను’ తర్వాత సినిమాల విషయంలో మహేష్ జోరు పెంచాడు. ఎందుకో తెలియ‌దు కానీ అస్స‌లు బ్రేక్ లేకుండా సినిమాలు ఓకే చేస్తున్నాడు. ప్రస్తుతం మహేష్..వంశీ పైడిప‌ల్లి దర్వకత్వంలో ‘మ‌హ‌ర్షి’ సినిమా సినిమా చేస్తున్నాడు. మార్చ్ నాటికి మ‌హ‌ర్షి పూర్తి కానుంది. ఆ త‌ర్వాత వెంట‌నే సుకుమార్ సినిమా ప‌ట్టాలెక్కించాలకున్నాడు సూప‌ర్ స్టార్. కానీ చిత్ర కథ విషయంలో సుకుమార్ ఇంకా ఆరు నెలలు టైమ్ అడగటంతో అప్పటి వరకు ఖాళీగా ఉండటం కంటే వేరే దర్శకుడితో నెక్ట్స్ ప్రాజెక్ట్ చేయాలని మహేష్ ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.

ఇక సుకుమర్ దర్శకత్వంలో చేయబోయే సినిమా అడవి నేపథ్యంలో పూర్తి థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కనున్నట్టు సమాచారం.ఇప్ప‌టికే ఇద్ద‌రు ద‌ర్శ‌కులు మ‌హేశ్ బాబుకు క‌థ చెప్పార‌ని తెలుస్తుంది. ఇందులో అనిల్ రావిపూడి కూడా ఉన్నాడు. వ‌ర‌స‌గా నాలుగు విజ‌యాల‌తో దూకుడు మీదున్న అనిల్.. ఇప్పుడు మ‌హేశ్ బాబు కోసం క‌థ సిద్ధం చేసాడనే వార్తలు వినిపిస్తున్నాయి. గ‌తంలో దూకుడు, ఆగ‌డు సినిమాకు అసిస్టెంట్‌గా పనిచేసారు అనిల్, మ‌హేశ్ బాబు. అప్పుడు శీనువైట్లతో ఉన్న అనిల్ రావిపూడి..ఇప్పుడు వ‌ర‌స విజ‌యాల‌తో స్టార్ డైరెక్టర్ అయ్యాడు.

ఇప్పటికే అనిల్ రావిపూడి..మహేష్‌కు లైన్‌పి ఒకే చేయించుకున్నాడని సమాచారం. ఈ సినిమాను దూకుడు సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కించే అవకాశాలున్నాయి. ఈ సినిమాకు కూడా వరుసగా అనిల్ రావిపూడితో సినిమాలను నిర్మిస్తున్న దిల్ రాజు ఈ చిత్రాన్ని తెరకెక్కించే అవకాశం ఉంది.

‘మహర్షి’ తర్వాత మరోసారి దిల్ రాజు నిర్మాణంలో ఈ సినిమా చేయనున్నాడు. మొత్తానికి సుకుమార్ సినిమా లేట్ అవ్వడంతో...ఇపుడు సీన్‌లోకి అనిల్ రావిపూడి ఎంంటరయ్యాడు. ఆయనతో పాటు దిల్ రాజు ఎంట్రీ ఇవ్వడం కొసమెరుపు.

పూర్తి ఆర్టికల్ ఇక్కడ చూడండి -http://v.duta.us/UokN4gAA

📲 Get Tollywood on Whatsapp 💬