మహేష్ తో ఏమోకాని మెగాడాటర్ సెట్టయ్యింది 🤔

  |   Tollywood

మహేష్ బాబు 26వ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తాడని అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అయితే కథ ఇష్యూ వల్ల మహేష్ 26వ చిత్ర దర్శకుడు మారిపోయాడని అనీల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు 26వ చిత్రం తెరకెక్కబోతున్నట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. దిల్ రాజు నిర్మాణంలో మహేష్ అనీల్ రావిపూడి మూవీ త్వరలో పట్టాలెక్కబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి.

సుకుమార్ మహేష్ ల మూవీ సంగతి పక్కన పెడితే తాజాగా నిహారిక మూవీ గురించిన ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం సుకుమార్ తన బ్యానర్ లో రెండు సినిమాలను మైత్రి మూవీస్ మరియు శరత్ మరార్ తో కలిసి నిర్మిస్తున్నాడు. ఒక వైపు అవి తెరకెక్కుతున్నాయి. మరో వైపు సుకుమార్ కొత్త ప్రాజెక్ట్ ను మొదలు పెట్టబోతున్నాడు.

నిహారిక కోసం ఒక లేడీ ఓరియంటెడ్ స్క్రిప్ట్ ను సుకుమార్ సిద్దం చేశాడట. తన శిష్యుడితో ఆ సినిమాను తెరకెక్కించబోతున్నాడు. సుకుమార్ రైటింగ్స్ తో కలిసి గీతాఆర్ట్స్ 2 మరియు అంజనా ప్రొడక్షన్స్ నిహారిక మూవీని నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

ప్రస్తుతం నిహారిక 'సూర్యకాంతం' అనే చిత్రాన్ని చేస్తోంది. ఆ సినిమా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ సినిమా విడుదలకు ముందే ఈ కాంబో వెంచర్ పట్టాలెక్కే అవకాశం కనిపిస్తోంది. నిర్మాతగా సరేకాని దర్శకుడిగా సినిమా ఎప్పుడుంటుందో చూడాలి.

పూర్తి ఆర్టికల్ ఇక్కడ చూడండి -http://v.duta.us/AFxKAQAA

📲 Get Tollywood on Whatsapp 💬