రామ్ చరణ్ ఎదో మాయ చేసాడు.. నయనతార ఓకే అనేసింది..🤔

  |   Tollywood

‘సైరా’ సినిమాపై ఉన్న అంచ‌నాలు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ కావ‌డంతో ఈ సినిమాపై అంచ‌నాలు కూడా భారీగా ఉన్నాయి. దానికి తోడు సురేంద‌ర్ రెడ్డి కూడా ఈ సినిమాను హాలీవుడ్ నిపుణుల‌తో క‌లిసి తెర‌కెక్కిస్తున్నాడు. ఈ చిత్రం కోసం చిరంజీవి కూడా చాలా క‌ష్ట‌ప‌డుతున్నాడు. వ‌య‌సును కూడా ప‌క్క‌న‌బెట్టి దున్నేస్తున్నాడు మెగాస్టార్. ఇందులో చిరు స‌ర‌స‌న న‌య‌న‌తార‌, త‌మ‌న్నా హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ చిత్రానికి ఊహించ‌ని షాక్ ఇస్తుంది న‌య‌న‌తార‌.

దీనికి కార‌ణం కూడా నిర్మాత రామ్ చ‌ర‌ణే. ‘సైరా’ ప్ర‌మోష‌న్ కోసం న‌య‌న‌తార‌ను రావాలంటూ ఆహ్వానించాడు రామ్ చ‌ర‌ణ్. అయితే సాధార‌ణంగా సినిమాకు సైన్ చేసే ముందు తాను ప్ర‌మోష‌న్ కు రాను అనే క‌మిట్మెంట్ తోనే అగ్రిమెంట్ చేసుకుంటుంది న‌య‌న‌తార‌. ఎంత పెద్ద హీరో అయినా కూడా న‌య‌న్ ప్ర‌మోష‌న్‌కు రాదు.

ఇదే విష‌యంపై అప్ప‌ట్లో శేఖ‌ర్ క‌మ్ముల‌తో అనామిక సినిమా స‌మ‌యంలో గొడ‌వ కూడా జ‌రిగింది న‌య‌న‌తారకు. ర‌జినీకాంత్, అజిత్ లాంటి స్టార్ హీరోల సినిమాల‌కు కూడా ప్ర‌మోష‌న్ చేయ‌దు ఈ ముద్దుగుమ్మ‌. అలా అయితేనే అందులో న‌టిస్తాను అని ముందే చెబుతుంది కూడా.

అలాంటిది ఇప్పుడు చిరంజీవి ‘సైరా’ సినిమా కోసం మాత్రం న‌య‌న‌తార ప్ర‌మోష‌న్ చేయ‌నుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. ఈ విష‌యంపైనే ప్ర‌త్యేకంగా న‌య‌నతార‌తో రామ్ చ‌ర‌ణ్ మాట్లాడాడ‌ని తెలుస్తుంది. దానికి న‌య‌న్ కూడా ఒప్పుకుంద‌ని.. చారిత్రాత్మ‌క సినిమా కావ‌డం.. ‘బాహుబ‌లి’ స్థాయిలో దీన్ని కూడా తెర‌కెక్కిస్తుండ‌టంతో ప్ర‌మోష‌న్ చేయ‌డానికి వ‌స్తాన‌ని న‌య‌న్ మాటిచ్చినట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ సినిమా ద‌స‌రాకు విడుద‌ల కానుంది. మ‌రి చూడాలిక‌.. న‌య‌న‌తార ప్ర‌మోష‌న్ చిరంజీవి సినిమాకు ఎంత‌వ‌ర‌కు క‌లిసొస్తుందో..?

పూర్తి ఆర్టికల్ ఇక్కడ చూడండి -http://v.duta.us/UHz43wAA

📲 Get Tollywood on Whatsapp 💬