‘ల‌క్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా ఎందుకు తీసానంటే.. నిజం చెప్పిన వ‌ర్మ‌..🤯

  |   Tollywood

ఈ అనుమానం చాలా మందిలో ఉంది. అస‌లెందుకు ఇప్పుడు వ‌ర్మ ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ తీసాడు.. కేవ‌లం డ‌బ్బుల కోస‌మే తీసాడా లేదంటే ఎవ‌రైనా కావాల‌నే ఆయ‌న‌తో ఈ సినిమాను చేయ‌మ‌ని చెప్పారా.. అస‌లు ఎందుకు వ‌ర్మ ఇప్పుడు ఇంత‌గా రెచ్చిపోయాడు అని చాలా మంది అనుమానం ఉంది. ఇప్పుడు దీనికి స‌మాధానం తానే ఇచ్చాడు వ‌ర్మ‌. త‌న ట్విట్ట‌ర్లో దీనిపై ఓ మెసేజ్ పోస్ట్ చేసాడు. 1989 ఎన్నిక‌ల్లో ఎన్టీఆర్ ఓడిపోయిన త‌ర్వాత ఆయ‌న్ని పార్టీతో పాటు కార్య‌కర్త‌లు.. కుటుంబ స‌భ్యులు కూడా ఒంర‌టిగా ఏకాకిగా వ‌దిలేసార‌ని చెప్పాడు వ‌ర్మ‌.

ఆ స‌మ‌యంలో ల‌క్ష్మీపార్వ‌తి అనే స్త్రీ ఎన్టీఆర్ జీవితంలోకి వ‌చ్చింద‌ని.. అప్పుడు వాళ్ల మ‌ధ్య సంబంధం మొత్తం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర రాజ‌కీయ ముఖ చిత్రాన్ని మార్చేసింద‌ని చెబుతున్నాడు వ‌ర్మ‌. పాతికేళ్లుగా నిజాలుగా చెలామ‌ణి అవుతున్న సిగ్గు లేని అబ‌ద్ధాల‌ను శాశ‌త్వంగా నిజం అనే గోతిలో క‌ప్పెట్ట‌డానికే తాను ఈ సినిమా తీసాన‌ని.. త‌న‌కు ఎన్టీఆర్ అలా చేయ‌మ‌ని చెప్పారంటున్నాడు వ‌ర్మ‌.

ఎన్టీఆర్ గారిని మోసం అనే విషం పూసి.. వెన్నుపోటు అనే కత్తితో చంపేసారని.. మోసగాళ్ల అసలు రూపాలను బయటికి తీసి నగ్నంగా నిలబెట్టడమే ఈ లక్ష్మీస్ ఎన్టీఆర్ ఉద్ధేశ్యం అంటున్నాడు వర్మ. ఈయన మాటలు చూస్తుంటే కావాలనే కొందర్ని దారుణంగా టార్గెట్ చేస్తున్నాడని అర్థమైపోతుంది. తాజాగా ఈయ‌న విడుద‌ల చేసిన వాయిస్ వీడియో కూడా సంచ‌ల‌నం సృష్టిస్తుంది.

పూర్తి ఆర్టికల్ ఇక్కడ చూడండి -http://v.duta.us/9GpfPAAA

📲 Get Tollywood on Whatsapp 💬