లవర్స్ డేకి శ్రీదేవి డెత్ యానివర్సరీ! 🥺

  |   Tollywood

ఏడాది గడిచినా ఇంకా శ్రీదేవి ప్రమాదవశాత్తు మరణించలేదని అభిమానులు నమ్ముతున్నారంటే అర్థం చేసుకోవచ్చు. అదంతా అటుంచితే శ్రీదేవిని బోనీ కపూర్ 1996 లో పెళ్లి చేసుకున్నారు. వారిది ప్రేమ వివాహం. పైగా రెండో వివాహం కావడంతో ఆ తర్వాత ఎన్నో పరిణామాలు శ్రీదేవికి ఇబ్బందికరంగా మారాయని సన్నిహితులు చెబుతారు. శ్రీదేవి మరణం వరకూ బోని మొదటి భార్య కుమారుడు హీరో అర్జున్ కపూర్ తనకు అస్సలు సన్నిహితంగా లేనేలేడు.

మరణానంతరం మాత్రం శ్రీదేవి కుమార్తెలు జాన్వీ ఖుషీలను దగ్గరకు చేరనిచ్చాడు. ప్రస్తుతం ఆ ఇద్దరినీ అభిమానంగానే చూసుకుంటున్నాడు కపూర్ బోయ్. శ్రీదేవి- బోనీల లవ్ స్టోరి ఆసక్తికరం. శ్రీదేవిని ప్రేమించి తనతో సినిమా చేయాలని బోనీ భావించారు. ఆ పరిచయమే ప్రేమగా మారి భార్య ఉండగానే రెండో పెళ్లికి దారి తీసింది. ``శ్రీదేవిని తొలిసారి పెద్ద తెరపై చూడగానే ప్రేమలో పడిపోయాను. తన కోసం చెన్నయ్ వెళ్లాను. ఛేజ్ చేశాను.

తనతో ఓ సినిమా చేయాలని భావించాను. కానీ తను అప్పుడు చెన్నయ్ లో దొరకలేదు. తన వర్కింగ్ స్టైల్ చూసి ఎంతో ఆశ్చర్యపోయేవాడిని`` అని బోనీ ఇదివరకూ న్యూదిల్లీలో జరిగిన శ్రీదేవి జయంతి కార్యక్రమాల్లో అన్నారు. శ్రీదేవి నాయికగా రూప్ కి రాణి చరోన్ కా రాజా జుడాయి చిత్రాల్ని బోనీకపూర్ నిర్మించారు.

పూర్తి ఆర్టికల్ ఇక్కడ చూడండి -http://v.duta.us/w3c3pAAA

📲 Get Tollywood on Whatsapp 💬