వర్మ అందుకే ధైర్యంగా ఉన్నాడు! 👍

  |   Tollywood

ఎన్టీఆర్ రెండో పెళ్లి తర్వాత ఏం జరిగింది అనే దాని గురించి నిజాలే చూపిస్తాను అంటున్న వర్మ నందమూరి కుటుంబ సభ్యుల నుంచి అనుమతి తీసుకోకపోయినా ఎందుకింత ధీమాగా ఉన్నాడు అనే సందేహం అభిమానుల్లో ఉంది. అయితే ఈ మౌనానికి కారణం ఉంది. చట్టప్రకారం చనిపోయిన వ్యక్తి బయోపిక్ తీయాలి అనుకున్నప్పుడు కుటుంబ సభ్యుల అనుమతి అవసరమే. నిర్ణయకర్తగా మొదటి వ్యక్తి జీవిత భాగస్వామే అవుతారు. ఈ లెక్కన లక్ష్మి పార్వతి అధికారికంగా వర్మకు పర్మిషన్ ఇచ్చింది కాబట్టి ఒకవేళ వారసులు కోర్టులు వెళ్లినా ఆంతగా వర్క్ అవుట్ కాకపోవచ్చు.

ఎన్టీఆర్ చివరి శ్వాస వరకు లక్ష్మి పార్వతినే భార్యగా పక్కన ఉన్నారు. వాళ్ళ బంధానికి చట్టబద్ధత ఉంది. సో ఆవిడే తీసుకోమని వర్మకు చెప్పాక అభ్యంతర పెట్టడానికి ఎవరికీ అవకాశం ఉండదు. ఒకవేళ కోర్ట్ ద్వారా ట్రై చేసినా నెగ్గడం అంత ఈజీ కాదు. వర్మ ఆ ధైర్యంతోనే ఇంతకు సిద్ధపడినట్టు తెలిసింది. చిన్న కామెంట్ చేసినా వర్మ దాన్ని పబ్లిసిటీకి వాడుకుంటాడు కాబట్టి బాలయ్య బ్యాచ్ వ్యూహత్మకంగా సైలెంట్ గా ఉన్నట్టు సమాచారం. తెరవెనుక లాయర్లతో లక్మిస్ ఎన్టీఆర్ ను అడ్డుకునేందుకు తగిన మార్గాల కోసం చర్చలుజరుగుతున్నట్టు ఫిలిం నగర్ గాసిప్.

పూర్తి ఆర్టికల్ ఇక్కడ చూడండి -http://v.duta.us/J5JIBwAA

📲 Get Tollywood on Whatsapp 💬