విశాల్ నిజమైన ప్రేమ ముద్దు 👫

  |   Tollywood

ఇప్పటిదాకా ఎన్నో సినిమాల్లో ఎందరో హీరోయిన్లకు ప్రేమ ముద్దులు ఇచ్చిన విశాల్ కు ఈ వాలెంటైన్ డే చాలా స్పెషల్ గా మిగిలింది. కారణం తన కాబోయే జీవిత భాగస్వామి అనీషాతో తొలి ముద్దు సంబరంతో పాటు మధుర క్షణాలను పంచుకున్నాడు కాబట్టి. ప్రేమికుల రోజు సందర్భంగా తన కురుల మీదుగా నుదుటిని వుడ్ బీ కిస్ చేస్తున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అనీషా సంతోషం మాములుగా లేదు. విశాల్ తన్మయత్వం కూడా సహజంగా ఉంది.

విశాల్ పెళ్ళికి ఓ చిన్న లిటిగేషన్ ఉంది. నడిగర్ సంఘం బిల్డింగ్ పూర్తి కావొస్తోంది. దాని ఓపెనింగ్ తర్వాతే పెళ్లి చేసుకుంటాను అని విశాల్ గతంలోనే శపథం చేసాడు. కనివిని ఎరుగని స్థాయిలో సౌత్ సినిమా ప్రముఖులందరిని ఒక చోట చేర్చి ప్రారంభించాలని పెద్ద ప్లాన్ తోనే ఉన్నాడు విశాల్. అదే వేదికగా మార్చి పెళ్లి చేసుకునే ఆలోచన కూడా తనకు ఉంది. ఇదంతా కొలిక్కి రావడానికి కొంత టైం అయితే పడుతుంది.

అందుకే అనీషా కానీ విశాల్ కానీ డేట్ గురించి ఎలాంటి అప్ డేట్ ఇవ్వడం లేదు. టెంపర్ రీమేక్ అయోగ్యలో రాశి ఖన్నాతో రొమాన్స్ చేస్తున్న విశాల్ అది పూర్తి చేసాక గౌతమ్ మీనన్ తో చేసే ప్లాన్ లో ఉన్నాడు. తెలుగులో ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న స్ట్రెయిట్ మూవీ ప్రతిపాదన ఈ ఏడాదే కార్యరూపం దాల్చేలా ఉంది.

పూర్తి ఆర్టికల్ ఇక్కడ చూడండి -http://v.duta.us/OiEkpgAA

📲 Get Tollywood on Whatsapp 💬