[andhra-pradesh] - ఆపరేషన్‌ చిరుత!

  |   Telugunews

అమలాపురం అటవీ ప్రాంతంలో 10 రోజులుగా దాగుడుమూతలుబలుసులంకలో ముగ్గురిపై దాడిఆనక ఓ గుడిసెలోని అటకపైకి..గుడిసె చుట్టూ వలలు బిగించి, ఫ్లడ్‌లైట్ల వెలుగులో ఆపరేషన్‌3 డోసులుగా మత్తు ఇంజక్షన్లుఅయినా, పంజాతో దాడి యత్నంఐదో విడతతో పూర్తయిన ఆపరేషన్‌విశాఖ తరలింపునకు ఏర్పాట్లు

అమలాపురం, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి) : తూర్పుగోదావరి జిల్లాలోని గౌతమినదీ తీర ప్రాంత ప్రజలకు పదిరోజులుగా కంటిమీద కునుకు లేకుండా చేసిన చిరుతపులి జాడ ఎట్టకేలకు దొరికింది. ముమ్మిడివరం మండలం గేదెల్లంక సమీపంలోని బలుసులంక వద్ద గురువారం ఉదయం చిరుత కనిపించడంతో కలకలం రేగింది. పెద్దసంఖ్యలో ప్రజలు గుమిగూడటంతో భయపడి, అక్కడికి సమీపంలోని ఒక పూరింటిలోని అటకపైకి ఎక్కింది. ఆ వెంటనే గుడిసె చుట్టూ వలపన్ని, ‘ఆపరేషన్‌ చిరుత’ను అటవీ శాఖ సిబ్బంది ప్రారంభించారు. అర్ధరాత్రి దాకా ఫ్లడ్‌లైట్ల వెలుగులో ఆపరేషన్‌ కొనసాగించారు. మత్తు మందు ఇచ్చి, చిరుతను ఎట్టకేలకు బంధించారు. విశాఖపట్నం తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

దీంతో పదిరోజులపాటు భయాందోళనలకు గురిచేసిన చిరుత కథ బోనుకు చేరింది. పది రోజుల క్రితం ఆత్రేయపురం మండలం అంకంపాలెంలో తొలిసారి చిరుత కనిపించింది. పంటపొలాల్లో పని చేసుకుంటున్న నలుగురు వ్యక్తులను గాయపరిచి, కొబ్బరిచెట్టు ఎక్కింది. గ్రామస్థులు, అటవీ శాఖ సిబ్బంది దానిని పట్టుకోడానికి సిద్ధమయ్యేలోపే అక్కడినుంచి తప్పించుకొంది. ఆ మరునాడు ర్యాలి, మెర్లపాలెంలో చిరుత కదలికలు కనిపించాయి. దీనిపై ఆరు బృందాలుగా అటవీ సిబ్బంది కొద్దిరోజులు గాలింపు జరిపారు....

Photo - http://v.duta.us/eo94iwAA

Click here to read more— - http://v.duta.us/rt9nhAAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬