[andhra-pradesh] - ఆమంచి ఎగ్జిట్ తర్వాత టీడీపీలో హాట్ టాపిక్‌గా మారిన అంశం ఇదే..!

  |   Telugunews

టీడీపీ టిక్కెట్‌కు పెరిగిన పోటీ

చీరాల(ప్రకాశం జిల్లా): ఎమ్మెల్యే ఆమంచి టీడీపీ అధిష్టానాన్ని నమ్మించి మోసం చేశాడు. అధిష్టానం అతని మాటలతో మోసపోయిందని భావించిన క్రమంలో చీరాల నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులను సమాయత్తపరిచి బలోపేతం చేసేందుకు ఆ పార్టీ అధినేత సీఎం చంద్రబాబు, ఎమ్మెల్సీ కరణం బలరామకృష్ణమూర్తికి బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారాయి. స్తబ్ధుగా ఉన్న చీరాల రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. దీంతో టీడీపీ తరుపున పోటీ చేసేందుకు అభ్యర్థులు పలువురు పోటీపడుతున్నారు. అయితే ఎమ్మెల్సీ కరణం బలరాంను అధిష్టానం చీరాల నుంచి బరిలోకి దించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈక్రమంలో స్థానికంగా ఉన్న కొందరు బీసీ నేతలు కూడా టిక్కెట్‌ను ఆశిస్తున్నారు. టీడీపీ గెలుస్తుందనే నమ్మకంతో ఆశావాహుల సంఖ్య పెరిగింది.

ఈక్రమంలోనే గురువారం గోలి సదాశివరావు కళ్యాణమండపంలో జరిగిన టీడీపీ చీరాల నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో అందుకు సంబంధించిన పోకడలు కనిపించాయి. సమావేశంలో ఆధ్యంతం లోలోన నేతలు తమ తమ మనోభావాలను వ్యక్తపరుస్తూ మాట్లాడారు. అందుకు సంబంధించి వారి వారి అనుచరులు తదనుగుణంగా వారికి మద్దతు తెలుపుతూ నినాదాలు చేశారు....

Photo - http://v.duta.us/r6VsvwAA

Click here to read more— - http://v.duta.us/gFzS-QAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬