[andhra-pradesh] - ఎన్నికల కోడ్‌ కోసం అధికారుల ఎదురుచూపు

  |   Telugunews

నరసాపురం, పశ్చిమగోదావరి: ఎన్నికలకు అధికార యంత్రాగం సన్నద్ధమవుతున్నది. ఇప్పటికే బదిలీల ప్రక్రియ జోరందు కుంది.ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నేడో రేపో కోడ్‌ అమల్లోకి రానున్నది. ఈ ఎన్నికలు పూర్తయిన వెంటనే సాధారణ ఎన్నికలు వచ్చేస్తాయి. అధికారులు కోడ్‌ పటిష్ఠంగా అమలు చేసేందుకు రెడీ అవుతున్నారు. గ్రామాలు, పట్టణాల్లో ఇబ్బడిముబ్బడిగా ఏర్పాటు చేసిన వివిధ పార్టీల బ్యానర్లు, ఫెక్సీలను తొలగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 5 లక్షలకు పైగానే బ్యానర్లు, ఫ్లెక్సిలు ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.

పుట్టినరోజులు, పండుగలు, పార్టీ సమావేశాలు ఇలా ప్రతి చిన్నదానికి బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం మామూలుగా మారింది. జిల్లాలోని ఏ పట్టణంలోని ప్రధాన కూడళ్ళల్లో చూసినా వివిధ పార్టీల నాయకుల బ్యానర్లు, ఫ్లెక్సీలు దర్శ నమిస్తున్నాయి. వ్యాపారస్థులు కూడా నేతల ఫొటోలను బ్యానర్లపై ముద్రించి ప్రచారం చేసుకోవడం పరిపాటిగా మారింది. ఈ కారణంగా పురపాలకం, పంచాయతీ అధికారులు కూడా వీటిని తొలగించేందుకు అలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సందర్భం ముగిసినా కట్టిన బ్యానర్లు, ఫ్లెక్సీలను తొలగించడం లేదు. నెలలు తరబడి ఉంచేస్తున్నారు....

Photo - http://v.duta.us/eYUqPAAA

Click here to read more— - http://v.duta.us/xYo4wAAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬