[andhra-pradesh] - ఎస్టీ గురుకులాల్లో 1100 పోస్టులు

  |   Telugunews

అమరావతి, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గిరిజన గురుకుల విద్యాసంస్థల్లో 1100 పోస్టులు భర్తీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ సొసైటీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జూనియర్‌ లెక్చరర్లు, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్లు, ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్లు, పీఈటీ ఉద్యోగాల నిమిత్తం నేరుగా నియామకం చేపట్టేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఆహ్వానించారు. జూనియర్‌ లెక్చరర్లు 44, పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ షెడ్యూల్డ్‌ ఏరియాలో 32, నాన్‌ షెడ్యూల్డు ఏరియాలో 24, ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్లు షెడ్యూల్డ్‌ ఏరియాలో 234, నాన్‌ షెడ్యూల్డ్‌ ఏరియాలో 642 పోస్టులు, షెడ్యూల్డ్‌ ఏరియాలో పీఈటీ 25, నాన్‌ షెడ్యూల్డు ఏరియాలో 99 పీఈటీ పోస్టులు భర్తీ చేయనున్నారు.

17న ఏఈఈ స్ర్కీనింగ్‌ టెస్ట్‌

వివిధ ఇంజనీరింగ్‌ సర్వీసులలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌(ఏఈఈ) పోస్టుల భర్తీ కోసం ఏపీపీఎస్సీ ఈ నెల 17న స్ర్కీనింగ్‌ టెస్ట్‌ నిర్వహిస్తోంది. ఆఫ్‌లైన్‌లో 150 మార్కులకు పరీక్ష జరుగుతుంది. అన్ని జిల్లాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేశారు. మొత్తం 309 పోస్టుల భర్తీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 47001 దరఖాస్తులు అందాయి. అంటే ఒక్కో పోస్టుకు 152 మంది పోటీ పడుతున్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు హాల్‌ టికెట్లు పంపిణీచేశారు.

Click here to read more— - http://v.duta.us/_C6M4wAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬