[andhra-pradesh] - కొడుకులపై గెలిచిన తండ్రి

  |   Telugunews

ఆలమూరు, తూర్పుగోదావరి: తండ్రికి మనోవర్తి చెల్లించాలని కింది కోర్టులో ఇచ్చిన తీర్పునే పై కోర్టును ఇవ్వడంతో మళ్లీ తండ్రే గెలిచాడు. తండ్రీ కొడుకుల కేసుల వివరాలలోకి వెళ్లితే ఆలమూరు మండలం గుమ్మిలేరుకు చెందిన పుల్లేటికుర్తి నాగభూషణం గుడిలో పూజారిగా జీవించేవారు. అయితే వయస్సు మీద పడటంతో తన వృత్తిని నలుగురు కుమారులలో ఒకరికి అందించారు. మిగిలిన కుమారులు వివిధ వృత్తులలో స్థిరపడారు. నాగభూషణాన్ని ఒకరు మినహా మిగిలిన కుమారులు సక్రమంగా పట్టించుకోకపోవడంతో నలుగురు నన్ను సమానంగా చూడాలని కోర్టును ఆశ్రయించారు.

దీంతో ఆలమూరు కోర్టులో గత ఏడాది న్యాయమూర్తి మిగిలిన ముగ్గురు కుమారులను వారివారి వృత్తులను బట్టి మనోవర్తి చెల్లించాలని తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ ముగ్గురు కుమారులు రాజమహేంద్రవరం జిల్లా కోర్టును ఆశ్రయించారు. అక్కడా ఇదే తీర్పును చెబుతూ అక్కడ న్యాయమూర్తి తీర్పు చెప్పినట్లు నాగభూషణం తరపు న్యాయవాది ఎస్‌కే షరీఫ్‌ తెలిపారు. తండ్రిని చూడాలసిన బాధ్యత కుమారులపై ఉందని ఆ తీర్పులో చెప్పారని ఆయన వివరించారు.

Photo - http://v.duta.us/iadEnQAA

Click here to read more— - http://v.duta.us/BAJGzgAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬