[andhra-pradesh] - కొండలో దాగిన చిరుత

  |   Telugunews

బోను ఏర్పాటుచేసిన అటవీ అధికారులు

పత్తికొండ, ఫిబ్రవరి 14: కర్నూలు జిల్లా పత్తికొండ మండలం జేఎం తండా సమీపంలోని ఓ కొండలో చిరుత దాగింది. చిరుతను పట్టుకునేందుకు అటవీ అధికారులు బోను ఏర్పాటుచేశారు. గురువారం ఉదయం పొలాల్లో రైతులు పనులు చేసుకుంటుండగా ఓ చిరుత కుక్కలను తరుముతూ కనిపించింది. దీంతో సమీప గ్రామాల ప్రజలకు సమాచారం ఇచ్చారు. జేఎం తండా, దూదేకొండ నుంచి పలువురు బరిశెలు, ఈటెలతో కొండ ప్రాంతానికి చేరుకుని చిరుత కోసం గాలించారు.

విషయం తెలుసుకున్న అటవీశాఖ ఆదోని రేంజ్‌ అధికారి వెంకటసుబ్బయ్య, పత్తికొండ రేంజర్‌ తాయన్న సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. చిరుత పాదముద్రలను గుర్తించి, ఫొటోలు తీసి అధికారులకు పంపించారు. అవి చిరుత పాదముద్రలేనని జిల్లా అధికారులు నిర్ధారించారు. దీంతో చిరుతను పట్టుకునేందుకు కొండ దిగువ ప్రాంతంలో ఎర పెట్టి బోను ఏర్పాటు చేశారు. సాధారణంగా చిరుతలు రాత్రిళ్లు సంచరిస్తాయని, మనుషులపై దాడి చేయవని అటవీశాఖ అధికారులు తెలిపారు. చిన్నచిన్న ప్రాణులపై మాత్రమే అవి దాడి చేస్తాయని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని తాయన్న చెప్పారు.

Photo - http://v.duta.us/JknBVgAA

Click here to read more— - http://v.duta.us/CP1UdgAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬