[andhra-pradesh] - టీడీపీలో సందడే సందడి

  |   Telugunews

తిరుపతి: పసుపు కుంకుమా, ఇతర పథకాల అమలుతో తిరుపతి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఉత్సాహంతో ఉరకలేస్తోంది. ఎమ్మెల్యే సుగుణ కార్యక్రమాల్లో వేగం పెరిగింది. తన స్వంత స్థలంలో టీడీపీ కార్యాలయాన్ని స్థాపించడం, పార్టీ చెప్పిన ప్రతి కార్యక్రమాన్నీ విజయవంతంగా నిర్వహించడం ద్వారా తన విధేయతను ఆమె చాటుకుంటున్నారు. ఈసారి కూడా తిరుపతి నుంచి పోటీ చేసే అవకాశం తనకే ఉంటుందని ఆమె నమ్మకంతో ఉన్నారు. అయినా టీడీపీ నుంచి మరో నలుగురైదుగురు నేతలు టిక్కెట్‌ ఆశిస్తున్నారు. తిరుపతిలో గణనీయమైన సంఖ్యలో ఉన్న యాదవ సామాజికవర్గానికి ఈ సారి ప్రాతినిధ్యం ఇవ్వాలనే డిమాండ్‌ తెరమీదకు వస్తోంది. అదే ఆలోచన ఉంటే తన పేరు పరిశీలించాలని తుడా ఛైర్మన్‌ నరసింహ యాదవ్‌ కోరుకుంటున్నారు.

టీడీపీ రాష్ట్రకార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్‌ రాళ్లపల్లి సుధారాణి, డాక్టర్‌ రాయ ఆశాలత, కాపు కార్పొరేషన్‌ డైరెక్టర్‌ వూకా విజయకుమార్‌, మాజీ ఎమ్మెల్యే మోహన్‌ వంటి వారు ఆశావహుల జాబితాలో ఉన్నారు. అనేక సమీకరణాల నేపథ్యంలో తనకు ఎమ్మెల్యే సీటు ఇవ్వలేకపోతే తన భర్త డాక్టర్‌ సుకుమార్‌కు తిరుపతి ఎంపీ సీటు కేటాయించాలని డాక్టర్‌ సుధారాణి ఇటీవల చంద్రబాబును కలిసి అభ్యర్ధించారు. వూకా విజయకుమార్‌ బలిజ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ బిజీగా ఉన్నారు. గల్లా కుటుంబ సహకారం తనకు ఉందనే ధీమాతో ఆయన ఉన్నారు. ప్రతీ కార్యక్రమంలోనూ కనిపించే డాక్టర్‌ రాయ ఆశాలత, ఏకారణం చేత అయినా టీడీపీ అభ్యర్ధిత్వం ఎమ్మెల్యే సుగుణకు కాదంటే, తన పేరు తెరమీదకు వస్తుందని నమ్ముతున్నారు. పార్టీ అధినేత మనసులో ఏమున్నా పార్టీ మాత్రం జోష్‌ మీద ఉంది. ప్రభుత్వ పథకాలనే గెలుపు మంత్రాలుగా భావిస్తూ ప్రజల్లో తిరుగుతున్నారు.

Photo - http://v.duta.us/UiBiPQAA

Click here to read more— - http://v.duta.us/fd7-agAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬