[andhra-pradesh] - తిరుపతి నియోజకవర్గంలో జాతీయపార్టీల జాడేది ?

  |   Telugunews

తిరుపతి: రాష్ట్ర విభజనతో దారుణంగా దెబ్బతిన్న కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. అయితే ఎవరి వర్గాలు వారివిగా కార్యక్రమాలు సాగుతున్నాయి. తొలి నుంచీ మాజీ ఎంపీ చింతామోహన్‌ ఒక్కరే జనాన్ని పోగేసుకుని నిరసనలు, డిమాండ్‌లతో కనిపిస్తున్నారు. ఇక మబ్బు దేవనారాయణరెడ్డి (పెద్దబ్బ), నగర అధ్యక్షుడు పొలకల మల్లిఖార్జున్‌, శ్రీదేవి.. ఎవరికి వారుగానే ఉన్నారు. నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి చేరికతో ఇటీవలే పార్టీలోకి వచ్చిన నవీన్‌కుమార్‌ రెడ్డి కూడా రోజూ ఏదో ఒక కార్యక్రమంతో జనాల్లో కనిపిస్తున్నారు. అశావహులంతా దరఖాస్తులు చేసుకోవచ్చని పీసీసీ ఇచ్చిన పిలుపు మేరకు డీసీసీ అధ్యక్షుడు వేణుగోపాలరెడ్డి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.

తిరుపతి అసెంబ్లీ సీటుకోసం ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆర్‌.శ్రీదేవి, పొలకల మల్లిఖార్జున్‌, నవీన్‌కుమార్‌ రెడ్డి పోటీపడుతున్నట్టు సమాచారం.ఇక కేంద్రంలో అధికారంలో వున్నా నియోజకవర్గంలో బీజేపీ బలం నామమాత్రమే. స్వతంత్రంగా పోటీ చేసే గెలిచే సత్తా ఆ పార్టీకి లేదు. భానుప్రకాష్‌ రెడ్డి, సామంచి శ్రీనివాస్‌, జల్లి మధుసూదనయాదవ్‌ వంటి నాయకులు పార్టీలో ఉన్నా టికెట్‌ కోసం పోటీ పడే పరిస్థితి లేదు. పార్టీ ఆదేశించి, ఆర్ధిక సాయం చేస్తే మాత్రం బరిలోకి దిగుతారు. విభజన తర్వాత రాష్ట్రానికి అన్యాయం చేశారనే ఆగ్రహంతో ఉన్న జనంలోకి వెళ్ళి కార్యక్రమాలు నిర్వహించే సాహసం ఆ పార్టీ నాయకులు పెద్దగా చేయడం లేదు.

Photo - http://v.duta.us/17i17QAA

Click here to read more— - http://v.duta.us/DbQK5QAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬