[andhra-pradesh] - పూరగుట్ట భూముల ఆక్రమణ!

  |   Telugunews

పేదలు, పోలీసుల మధ్య వాగ్వాదంరాజకీయ ప్రమేయం!

మైలవరం రూరల్‌: మైలవరం శివారులోని పూరగుట్ట భూములను పేదలు ఆక్రమించుకున్నారు. మైలవరం, పొందుగల గ్రామాలకు చెందిన దాదాపు 100 మంది నిరుపేదలు గురువారం కర్రలకు తాటి ఆకులు, చెట్ల కొమ్మలను భూముల మధ్యలో గుర్తుగా పెట్టారు. వీరికి వైసీపీ, జనసేన, సీపీఐ మద్దతు తెలిపాయి. ఎన్నో ఏళ్ల నుంచి ఇళ్ల స్థలాల కోసం ఎదురు చూస్తున్నామని, ఇప్పుడు వస్తాయో రావో అనే ఆందోళనతో ఈ చర్యలకు పాల్పడినట్లు ఆ గ్రామాల్లోని పేదలు అంటున్నారు. దీనిపై సమాచారం అందుకున్న ఎస్సై ఈశ్వరరావు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని అక్కడ నుంచి వారిని ఖాళీ చేయించే ప్రయత్నం చేశారు. పోలీసులు, పేదల మధ్య వాగ్వాదం జరిగింది. సీపీఎం ఆధ్వర్యంలో ఆ భూముల్లోనే ఆందోళన చేశారు. పేదలకు పట్టాలు ఇవ్వాలని నినాదాలు చేశారు. నచ్చచెప్పినా వారు వినకపోవడంతో పోలీసులు వెనుదిరిగారు.

రాజకీయ జోక్యం.. దక్కని నివేశన స్థలాలు

జలవనరుల మంత్రి దేవినేని ఉమా.. రూ.2 కోట్లతో మైలవరం నుంచి పూరగుట్ట వరకు రోడ్లు వేయించడమే కాకుండా వీధి దీపాలు, ఇతర వసతులు కల్పిం చారు. పూరగుట్ట భూమిని పేదలకు నివేశనా స్థలాలుగా ఇవ్వడానికి గత జన్మభూమిలో పట్టాలు సిద్ధం చేశారు. కానీ ఈ స్థలాల పంపిణీ విషయంలో రాజకీయ ప్రమేయం చోటు చేసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా పట్టాలు ఇస్తున్నారంటూ వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త వసంత కృష్ణప్రసాద్‌ ఆ సభలో గొడవ చేశారు. అంతేకాకుండా తహసీల్దార్‌పై జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. తర్వాత కోర్టులో కేసులు వేశారు. పేదలకు నివేశనా స్థలాల విషయంలో ప్రతిపక్షం అడ్డుపడుతోందని, అమాయకులను రెచ్చగొట్టి ఆందోళన చేయించారని, రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. పూరగుట్ట విషయంలో ప్రజలకు వాస్తవాలు తెలుసని, ఈ అంశాన్ని విపక్షాలు తెలుసుకోవాలని టీడీపీ నేతలు అంటున్నారు.

Photo - http://v.duta.us/AhNrXgAA

Click here to read more— - http://v.duta.us/9n4wdQAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬