[andhra-pradesh] - ప్రభుత్వ నిర్ణయంతో రైతులకు ఉపశమనం

  |   Telugunews

రెండు విడతల రుణమాఫీ సొమ్ము..జిల్లాలో 4.72 లక్షల మంది రైతులకు ఇప్పటికే లబ్ధి‘అన్నదాత సుఖీభవ’లో గ్రీన్‌సిగ్నల్‌

కాకినాడ: కష్టాల్లో ఉన్న రైతులకు రాష్ట్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయంతో ఆర్థిక ఉపశమనం లభించనుంది. గత ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ సీఎం చంద్రబాబు నెరవేర్చే దిశగా నిర్ణయం తీసుకున్నారు. సాధారణ ఎన్నికలు రాకముందే దీన్ని అమలు చేయాలని ఆయన భావించారు. రైతులకు చెల్లించాల్సిన రుణమాఫీ నగదులో పెండింగ్‌లో ఉన్న రెండు విడతలను ఒకేసారి వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. రైతులకు ఇచ్చిన హామీలో వారు తీసుకున్న రుణంలో గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు మాఫీ చేస్తామని సీఎం ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే తొలి దశలో రూ.50 వేలలోపు రుణం తీసుకున్న వారికి మాఫీ వర్తింపజేశారు. మిగిలినవారు మూడు విడతల్లో రూ.90 వేలు తీసుకున్నారు. మరో రెండు విడతల్లో మిగిలిన రూ.60 వేలు బ్యాంకు ఖాతాల్లో వేస్తామని ప్రకటించారు.అయితే ఎన్నికల కోడ్‌ రాను న్నందున ఈ మొత్తానికి వడ్డీ జత చేసి ఒకేసారి చెల్లిం చేలా నిర్ణయించారు. రుణమాఫీ ప్రకటించాక ఇప్పటి వరకు జిల్లాలో అర్హులైన రైతులు 4.72 లక్షల మందికి లబ్ధి చేకూరింది. వీరికి సుమారు రూ.1432.63 కోట్లు చెల్లించారు. తాజాగా చివరి రెండు విడతల్లో మిగిలిన రైతులకు సుమారు రూ.1100 కోట్ల వరకు చెల్లించే అవకాశాలున్నాయి....

Photo - http://v.duta.us/nZToLwAA

Click here to read more— - http://v.duta.us/ZMXPKwAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬