[andhra-pradesh] - పౌర సరఫరాల శాఖ కమిషనర్‌గా వరప్రసాద్‌

  |   Telugunews

వ్యవసాయ శాఖకు బుడితి రాజశేఖర్‌మరోసారి ఐఏఎస్‌ల బదిలీలు

అమరావతి, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మరోమారు ఐఏఎస్‌ల బదిలీలు జరిగాయి. కొందరికి స్థానచలనం కల్పిస్తూ, వెయిటింగ్‌లో ఉన్న మరికొందరికి పోస్టింగ్‌లు ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే ఇటీవలి బదిలీల్లో పాక్షిక మార్పులు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. సుదీర్ఘకాలం పౌర సరఫరాల శాఖ కమిషనర్‌గా ఉన్న బుడితి రాజశేఖర్‌ను వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శిగా బదిలీ చేసింది. అలాగే ఆర్టీజీకి ముఖ్యకార్యదర్శిగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తారని ప్రభుత్వం తెలిపింది.

కార్మిక శాఖ కమిషనర్‌గా ఉన్న డి.వరప్రసాద్‌ను పౌర సరఫరాల శాఖ కమిషనర్‌గా బదిలీ చేసింది. కార్మిక, విపత్తుల నిర్వహణ శాఖల పూర్తి అదనపు బాధ్యతల్లోనూ ఆయననే కొనసాగిస్తున్నట్లు తెలిపింది. ఇటీవలే గనుల శాఖ కార్యదర్శిగా బదిలీ అయిన ఐ.శ్రీనివాస శ్రీనరేశ్‌కు చేనేత, జౌళిశాఖ పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఇటీవలి బదిలీల్లో టూరిజం కార్పొరేషన్‌ ఎండీతోపాటు టూరిజం అథారిటీ సీఈవో బాధ్యతలను కె.ధనుంజయరెడ్డికి అప్పగించిన ప్రభుత్వం.. ఆయన్ను టూరిజం ఎండీకి పరిమితం చేసింది....

Click here to read more— - http://v.duta.us/gp_wXgAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬