[andhra-pradesh] - ముగిసిన అష్టాబంధన మహాకుంభాభిషేకం

  |   Telugunews

నేత్రపర్వంగా పూర్ణాహుతి

పెందుర్తి, ఫిబ్రవరి 14: దేశం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ విశాఖపట్నం శారదా పీఠంలో నిర్వహిస్తున్న అష్టాబంధన మహాకుంభాభిషేకం గురువారం ముగిసింది. మధ్యాహ్నం పీఠం యాగశాలలో నేత్రపర్వంగా పూర్ణాహుతి చేశారు. ఈ సందర్భంగా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి అనుగ్రహ భాషణ చేస్తూ భావితరాల వారికి ఆధ్యాత్మిక శక్తి పెంపుదల, భక్తులకు అమ్మవారి అనుగ్రహం కోసం పీఠంలో రాజశ్యామల ఆలయం నిర్మించామని వివరించారు.

భక్తులందరికీ అమ్మవారి కృప ఉండాలన్నారు. తొలుత క్రతువులో పాల్గొన్న రుత్వికులను సత్కరించారు. అలాగే పీఠం ఆస్థాన శిల్పి జయేంద్ర స్థపతికి స్వర్ణకంకణం, ధర్మాధికారి కామేశ్వరశర్మకు స్వర్ణ అంగుళీకం, ఆభరణ శిల్పి గణే్‌షకు అంగుళీకం స్వామీజీ చేతులు మీదుగా ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు, తెలంగాణకు చెందిన కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు తదితరులు పాల్గొన్నారు. కాగా, జూన్‌ 17న అమరావతిలో ఉత్తర పీఠాధిపతి బాలాస్వామికి పీఠం అన్ని శాఖల బాధ్యతలు అప్పగించనున్నారు.

Photo - http://v.duta.us/WDCJWAAA

Click here to read more— - http://v.duta.us/JL3DrAAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬