[andhra-pradesh] - వైసీపీ, టీడీపీ కార్యకర్తల ఘర్షణ

  |   Telugunews

కోటబొమ్మాళిలో 21మందిపై కేసు నమోదు

టెక్కలి, ఫిబ్రవరి 14: శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో ఓ ఫ్లెక్సీ చించివేత వ్యవహారంపై వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ కొట్లాటకు దారితీసింది. కొన్నిరోజులుగా ఇరు పార్టీలు మధ్య ఫ్లెక్సీలు రగడ జరుగుతోంది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం వైసీపీకి చెందిన కాళ్ల సంజీవరావు, నూకరాజు, చంటి, యర్రయ్యలతో పాటు మరికొందరు కార్యకర్తలు స్థానిక జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాల సమీపంలో టీడీపీ కార్యకర్తలు మంగి రమణ, మూగ అచ్చయ్యరెడ్డితో ఘర్షణకు దిగారు. కోటబొమ్మాళి ఎస్‌ఐ సంఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాలను స్టేషన్‌కు పిలిచి సర్దిచెప్పారు. పోలీసుస్టేషన్‌ నుంచి బయటకు వచ్చిన అనంతరం ఇరువర్గాల మధ్య ఘర్షణ కొట్లాటకు దారితీసింది.

ఈ సంఘటనలో వైసీపీకి చెందిన నలుగురు కార్యకర్తలు గాయపడ్డారు. క్షతగాత్రులను టెక్కలిలో గల జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న వైసీపీ పార్లమెంటరీ పార్టీ కన్వీనర్‌ దువ్వాడ శ్రీనివాస్‌, నియోజకవర్గ కన్వీనర్‌ పేడాడ తిలక్‌ అనుచరులతో పోలీ్‌సస్టేషన్‌ వద్దకు చేరుకొని అధికార పార్టీ నాయకులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సుమారు రెండుగంటల సేపు బైఠాయించారు. వైసీపీ కార్యకర్తలపై దాడిచేసిన వారిని అరెస్టు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా కాశీబుగ్గ డీఎస్పీ బర్ల ప్రసాదరావు మాట్లాడుతూ వైసీపీ, టీడీపీకి చెందిన 21మందిపై కేసు నమోదు చేశామని తెలిపారు.

Photo - http://v.duta.us/R_8QrAAA

Click here to read more— - http://v.duta.us/yrOigAAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬