#RRR: చరణ్ కు ఛాలెంజింగ్ పాత్ర! 👍

  |   Tollywood

ఈ సినిమాలో చరణ్ కోసం ఒక ఛాలెంజింగ్ పాత్రను డిజైన్ చేశారట రాజమౌళి. ఇప్పటివరకూ చరణ్ ఎప్పుడు ఇలాంటి షేడ్స్ ఉన్న పాత్ర ను పోషించలేదట. ఈ సినిమాలో చరణ్ పాత్రంకు మూడు విభిన్న పార్శ్వాలు ఉంటాయట. బ్రిటిష్ ఆఫీసర్ గా.. ఒక ఫ్రీడమ్ ఫైటర్ గా.. ఒక మాస్ నాయకుడుగా.. ఇలా మూడు డిఫరెంట్ షేడ్స్ ఉండే పాత్రను పోషిస్తున్నాడట చరణ్.

ట్విస్ట్ ఇంతటితో ఆగలేదు.. చరణ్ పాత్రకు పాజిటివ్ షేడ్స్ తో పాటుగా నెగెటివ్ షేడ్స్ కూడా ఉంటాయట. 'రంగస్థలం'లో చిట్టిబాబుగా చెలరేగిపోయిన చరణ్ కు మరోసారి నటన విషయంలో పెద్ద టెస్ట్ పెట్టినట్టున్నాడు జక్కన్న.

ఇదిలా ఉంటే #RRR షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్లో జరుగుతోంది. గత వారంరోజులుగా రాజమౌళి ఒక భారీ యాక్షన్ సీక్వెన్సును చరణ్.. ఇతర ఫైటర్లపై తెరకెక్కిస్తున్నాడట. ఈ ఎపిసోడ్ చరణ్ కు సంబంధించినది కావడంతో ఎన్టీఆర్ కు మాత్రం కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చారట.

పూర్తి ఆర్టికల్ ఇక్కడ చూడండి -http://v.duta.us/I8E40AAA

📲 Get Tollywood on Whatsapp 💬