[telangana] - అమ్మాయిని చూపిస్తానని తీసుకెళ్లి..

  |   Telugunews

అమ్మాయిని చూపిస్తానని తీసుకెళ్లి హత్యడబ్బు కోసం వృద్ధుడిని హతమార్చిన వ్యక్తి అరెస్టురూ. 1.75 లక్షలు, స్కూటీ స్వాధీనం

హైదరాబాద్, కల్వకుర్తి అర్బన్‌, (ఆంధ్రజ్యోతి): గత ఏడాది జరిగిన వృద్ధుడి హత్య కేసులో నిందితుడిని కల్వకుర్తి పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి స్కూటీ, రూ. 1.75 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌ కూకట్‌పల్లికి చెందిన రాందాస్‌(76) విశ్రాంత ఉద్యోగి. అతడితో శ్రీరాములు ఆచారికి పరిచయం ఏర్పడింది. తాను పెళ్లి చేసుకుంటానని, అమ్మాయిని చూపించమని రాందాసు శ్రీరాములును కోరాడు. అప్పటికే డబ్బులకు ఇబ్బంది పడ్తున్న శ్రీరాములు కొంత ఖర్చవుతుందని చెప్పాడు. గత ఏడాది నవంబర్‌ 5వ తేదీ ఉదయం హైదరాబాద్‌లోని డిస్ర్టిక్ట్‌ కో అపరేటివ్‌ బ్యాంక్‌లో రాందాసు ఖాతా నుంచి రూ. 2 లక్షలు డ్రా చేయించాడు. శ్రీరాములు అతడిని స్కూటీపై ఆబిడ్స్‌ తీసుకెళ్లాడు. అక్కడ వాహనం పార్క్‌ చేసి ఎంజీబీఎస్‌ చేరుకొని బస్సులో కల్వకుర్తి వచ్చారు. అమ్మాయిని చూపిస్తానని చెప్పి రాందాసును ఆటోలో సుద్దకల్‌ తీసుకెళ్లాడు. దుందుభీ నది బ్రిడ్జి కిందకు తీసుకెళ్లి మద్యం తాగించాడు. రాందాసు మద్యం తాగుతుండగా శ్రీరాములు వెనుక నుంచి బండరాయితో తలపై మోదాడు. తర్వాత బ్లేడ్‌తో గొంతు కోసి చంపేశాడు. తర్వాత బస్సులో హైదరాబాద్‌ చేరుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బ్యాంక్‌ సీసీ ఫుటేజీల ఆధారంగా రాందాసు వెంట ఉన్న వ్యక్తిని గుర్తించారు....

Click here to read more— - http://v.duta.us/Lu1_OgAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬