[telangana] - నేటి నుంచి ఆరోగ్య ఫెయిర్‌-2019

  |   Telugunews

హైదరాబాద్‌: భారత ఆయూష్‌ మంత్రిత్వ శాఖ, తెలంగాణ ఆయూష్‌ శాఖ, పీహెచ్‌డీ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీల ఆధ్వర్యంలో ఆరోగ్య ఫెయిర్‌-2019 పేరిట ప్రదర్శన జరగనుంది. ఈ నెల 15, 16, 17 తేదీల్లో ఖైరతాబాద్‌ ఐమాక్స్‌ థియేటర్‌ పక్కన ఉన్న హెచ్‌ఎండీఏ ఖాళీ స్థలంలో ఈ ప్రదర్శనను నిర్వహిస్తున్నట్లు పీహెచ్‌డీ చాంబర్స్‌ ఉపాధ్యక్షుడు వివేక్‌ సెహగల్‌ పేర్కొన్నారు. ప్రదర్శన జరిగే స్థలంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. నగరవాసులకు ఉచిత వైద్య పరీక్షలు చేసేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు ఉన్నాయన్నారు.

షుగర్‌, బీపీ, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేకుండా ఉపశమనం కలిగించే ఆయూష్‌ వైద్య చికిత్సలపై అవగాహన కల్పిస్తామన్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ ఆయూష్‌ సంస్థలతో పాటు తెలంగాణ రాష్ట్ర సంస్థలు తమ స్టాళ్ల ద్వారా ప్రాధాన్యాన్ని వివరిస్తాయన్నారు. ఈ ప్రదర్శనను శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ, సికింద్రాబాద్‌ ఎంపీ బండారు దత్తాత్రేయ, తదితరులు ప్రారంభిస్తారన్నారు. ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఈ ఫెయిర్‌ ఉంటుందని, పూర్తి ఉచిత ప్రవేశంతో నగరవాసులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగ పర్చుకోవాలని తెలిపారు.

Click here to read more— - http://v.duta.us/8RP0bAAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬