[telangana] - 24న వివాహం... అక్కకు వాట్సాప్‌ మెసేజ్‌ పెట్టి..

  |   Telugunews

హైదరాబాద్, హయత్‌నగర్‌, (ఆంధ్రజ్యోతి): పది రోజుల్లో వివాహం జరగాల్సి ఉండగా అంతలోనే ఓ యువకుడు గుర్తుతెలియని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కొత్తపేట్‌కు చెందిన బొడ్డుపల్లి అంజయ్య కుమారుడు సుభాష్‌(33) బేగంబజార్‌లో బద్రకాళి ఇండస్ర్టీస్‌ విస్తరాకుల కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈనెల 7వ తేదీన హయత్‌నగర్‌ మండలానికి చెందిన యువతితో అతడికి నిశ్చితార్థం జరిగింది. 24న పెళ్లి చేసేందుకు నిర్ణయించారు. సుభాష్‌ గురువారం ఉదయం షేవింగ్‌ చేయించుకోవటానికి బార్బర్‌ షాప్‌నకు వెళ్లాడు. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో.. ‘తనకు బతకాలని లేదని.. చనిపోతున్నానని’ ఉప్పల్‌లో నివసిస్తున్న అక్కకు వాట్సాప్‌ మెసేజ్‌ పెట్టాడు. కుంట్లూర్‌లో బీఎస్‌ఆర్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ సమీపంలో చెట్ల కిందకు వెళ్లి గుర్తుతెలియని పురుగుల మందును కూల్‌డ్రింక్‌లో కలుపుకొని తాగి చనిపోయాడు. స్థానికులు చూసి హయత్‌నగర్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకొని సెల్‌ఫోన్‌ ఆధారంగా అతడి కుటుంబ సభ్యులకు సమాచారం. అతడి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. మృతుడి తండ్రి అంజయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Photo - http://v.duta.us/1NPu-wAA

Click here to read more— - http://v.duta.us/fByUXQAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬