అల్లు అర్జున్ కూతురు దేశ‌ముదురు.. నాన్న చెప్పిన అబ్బాయిని చేసుకోదంట‌..👨‍👧

  |   Tollywood

అల్లు అర్జున్ ఇప్పుడు సినిమాల‌తో కాకుండా కుటుంబంతో బిజీగా ఉన్నాడు. నా పేరు సూర్య త‌ర్వాత ఈయ‌న సినిమాల‌కు దూరంగా ఉన్నాడు. ఈ మ‌ధ్యే త్రివిక్ర‌మ్ సినిమా ఒప్పుకున్నా కూడా ఇప్ప‌టి వ‌ర‌కు ఆ సినిమా ప‌ట్టాలెక్క‌లేదు. ఫిబ్ర‌వ‌రిలోనే ఈ చిత్రం ప‌ట్టాలెక్క‌నుంది. అప్ప‌టి వ‌ర‌కు ఇంట్లో పిల్ల‌ల‌తో ఆడుకుంటున్నాడు బ‌న్నీ. హాయిగా వాళ్ల‌తోనే టైమ్ స్పెండ్ చేస్తున్నాడు. ఇప్పుడు కూడా బ‌న్నీ త‌న కూతురుపై ఆడుకుంటున్న వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. కూతురుతో ఎం చ‌క్కా అన్నీ మ‌రిచిపోయి ఆనందంగా ఉన్నాడు బ‌న్నీ.

తాను చెప్పిన‌ట్లుగా కూతురుతో అనిపిస్తున్నాడు బ‌న్నీ. నేను నాన్న చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని కూతురుతో అనిపిస్తున్నాడు బ‌న్నీ. నేను నాన్న చెప్పిన అబ్బాయిని వ‌ర‌కు అన్న ఆ చిన్నారి.. చేసుకోనంటూ ముద్దుగా పలుకుతుంది. చూడ్డానికి చాలా క్యూట్ గా ఉన్న వీడియో ఇప్పుడు వైర‌ల్ అవుతుంది. బ‌న్నీ ఫ్యాన్స్ కూడా ఈ వీడియో చూసి తెగ షేర్లు చేసుకుంటున్నారు. నిర్మాత ఎస్ కే ఎన్ ఈ వీడియోను ట్విట్ట‌ర్లో పోస్ట్ చేసాడు. మొత్తానికి బ‌న్నీ మాదిరే కూతురు కూడా దేశ‌ముదురే అన్న‌మాట‌.

వీడియో ఇక్కడ చూడండి -http://v.duta.us/0KKW6QAA

పూర్తి ఆర్టికల్ ఇక్కడ చూడండి -http://v.duta.us/b9q9KAAA

📲 Get Tollywood on Whatsapp 💬