ఒకే రోజు వస్తోన్న ఇద్దరు మాజీ సీఎంలు..యాత్ర Vs ఎన్టీఆర్ కథానాయకుడు😳

  |   Tollywood

ఏంటి ఒకే రోజు ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు రావడం ఏంటి అనుకుంటున్నారా..! ఈ రోజు దివంగత మాజీ సీఎం వైయస్.రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా దారితీసిన పరిస్థితులపై తెరకెక్కిన ‘యాత్ర’ సినిమా విడుదల అవుతోంది. ఈ సినిమా దాదాపు 270 స్క్రీన్స్‌లో రిలీజ్ కానుంది. మహి.వి.రాఘవ్ డైరెక్ట్ చేసాడు.

మరోవైపు ‘యాత్ర’ సినిమాకు పోటీగా బాలకృష్ణ హీరోగా నటించిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ కూడా ఈ రోజే విడుదల కానుంది. ఆల్రెడీ సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా మళ్లీ రిలీజ్ కావడం ఏమిటి అనుకుంటున్నారా ? ఏమి లేదు ఈ సినిమాను ఈ రోజు అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేశారు. ఈ విషయాన్ని ఈ చిత్ర నిర్మాణ సంస్థ అఫీషియల్‌గా ప్రకటించింది.

‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమా రిలీజ్ కాకముందే ఈ సినిమాను ప్రముఖ డిజిటల్ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కావడం ఆసక్తి రేకిత్తిస్తోంది. మరోవైపు ఎన్టీఆర్ మహానాయకుడు అఫీషియల్ రిలీజ్ డేట్‌ను..ఈ వారంలోపే ప్రకటించనున్నారు. మొత్తానికి థియేటర్‌లో వైయస్ఆర్ ‘యాత్ర’కు పోటీగా..‘ఎన్టీఆర్ కథానాయకుడు’ అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల కావడం యాదృచ్చకమనే చెప్పాలె.

పూర్తి ఆర్టికల్ ఇక్కడ చూడండి -http://v.duta.us/ioElMAAA

📲 Get Tollywood on Whatsapp 💬