చంద్రబాబుపై నాగుబాబు సెటైర్లు..రక్తం మరుగుతోందా ? 😡

  |   Telugunews

చంద్రబాబునాయుడుపై ప్రముఖ సినీనటుడు నాగుబాబు సెటైర్లు వేశారు. నా ఛానల్ నా ఇష్టం అనే వీడియోలో చంద్రబాబు రక్తం మరగటం అనే ప్రకటన గురించి వ్యంగ్యంగా విరుచుకుపడ్డారు. మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు బిజెపి ఎంఎల్ఏలను ఉద్దేశించి తెచ్చిపెట్టకున్న ఆవేశంతో ఊగిపోయారు. కేంద్రం నుండి నాలుగున్నరేళ్ళలో రాష్ట్రప్రయోజనాలను సాధించుకురాలేని తన చేతకాని తనాన్ని ఇఫుడు కేంద్రప్రభుత్వంపై రద్దేస్తున్న విషయం అందరూ చూస్తున్నదే. అందులో భాగంగానే బిజెపి ఎంఎల్ఏలపై చంద్రబాబు రెచ్చిపోయారు.

అదే విషయాన్ని నాఛానల్ నా ఇష్టంలో సెటైరిటికల్ గా చెప్పారు. ఒకవైపు గ్యాస్ స్టౌ నై పాలు పెట్టారు. అది సుమారుగా నాలుగున్నర నిముషాల్లో మరిగింది. అదే దృశ్యాన్ని వీడియోలో చూపారు. తన వీడియోలో ఒకవైపు పాలు మరగటాన్ని చూపుతునే మరో వైపు చంద్రబాబు ఊగిపోవటాన్ని చూపారు.

చూశారుగా పాలు మరగటానికి నాలుగున్నర నిముషాలు పడితే, మన సిఎం చంద్రబాబు రక్తం మరగటానికి నాలుగున్నరేళ్ళు పట్టింది' అన్నారు.

తర్వాత ఎక్కువ మంట పెడితేనే పాలు తొందరగా మరుగుతుంది. ఎలక్షన్లు వస్తేనే మన చంద్రబాబునాయుడుగారి రక్తం మరుగుతుంది అంటూ వ్యంగ్యంగా పోస్టు చేశారు. నాగుబాబు కొత్తగా ప్రారంభించిన ఈ పొలిటికల్ సెటైర్లు బాగా జనాలను ఆకట్టుకుంటున్నాయనే చెప్పాలి. పనిలో పనిగా తన తమ్ముడు పవన్ కల్యాణ్, జనసేన మీద కూడా వేస్తే బాగానే ఉంటుంది.

పూర్తి ఆర్టికల్ ఇక్కడ చూడండి -http://v.duta.us/3CUfVQAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬