చంద్రబాబు ‘మేనిఫెస్టో’ ప్రసంగం... వైఎస్ జగన్‌కు కౌంటర్ ?👊

  |   Telugunews

ఎన్నికలకు ముందు అనేక అన్ని వర్గాల ప్రజలపై వరాల జల్లు కురిపిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు... రాజకీయంగా తన ప్రత్యర్థులను కౌంటర్ చేయడంలోనూ దూసుకుపోతున్నారు. ఎవరూ ఊహించని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు... ఎన్నికల మేనిఫెస్టోలో ఎలాంటి హామీలు ఇస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది.

ఏపీలో వెయ్యి రూపాయలుగా ఉన్న పెన్షన్‌ను కొద్ది రోజుల క్రితమే రెండు వేలు చేశారు చంద్రబాబు. ఇందుకు కౌంటర్‌గా... తాము అధికారంలోకి వస్తే వృద్ధాప్య ఫించన్‌ను మూడు వేల రూపాయలు చేస్తానని విపక్ష నేత వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.

అంతేకాదు... డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేయడంతో పాటు వారికి వడ్డీలేని రుణం ఇస్తామని వైఎస్ జగన్ ప్రకటించారు. చంద్రబాబుకు మించి వైఎస్ జగన్ హామీలు ఇస్తుండటంతో... అందుకు కౌంటర్’గా టీడీపీ ఏం చేస్తుందనే అంశంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఎన్నికల మేనిఫెస్టో అంశంలో టీడీపీ, వైసీసీలు పరస్పరం పోటీ పడటం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలతో జరిపిన టెలీకాన్ఫిరెన్స్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు.

శుక్రవారం అసెంబ్లీలో తాను చేయబోయే ప్రసంగం... పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రతిబింబిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో చంద్రబాబు తన అసెంబ్లీ ప్రసంగంలో టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామో ప్రకటిస్తారనే టాక్ వినిపిస్తోంది. అయితే తన అసెంబ్లీ ప్రసంగంలోనే మేనిఫెస్టో అంశాలను చంద్రబాబు ప్రస్తావిస్తారా... లేక ఎలాంటి హామీలు ఇస్తామనే దానిపై పరోక్షంగా సంకేతాలు ఇస్తారా అన్నది ఉత్కంఠ రేపుతోంది. మొత్తానికి చంద్రబాబు తన మేనిఫెస్టోలోని అంశాలను ప్రస్తావిస్తే... అంతకుమించిన పథకాలకు వైసీపీ రూపకల్పన చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

పూర్తి ఆర్టికల్ ఇక్కడ చూడండి -http://v.duta.us/7f13lAAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬