పాప కోటి-నైటు ట్వీటు గురించి మాట్లాడదే 💃

  |   Tollywood

అల్లరి నరేష్ 'జేమ్స్ బాండ్' సినిమాతో కాస్త గుర్తింపు తెచ్చుకున్న భామ సాక్షి చౌదరి. అడపాదడపా సినిమాలు చేస్తున్నా పెద్దగా బ్రేక్ రాలేదు ఈ బ్యూటీకి. కానీ ఈమధ్య ఒక్క ట్వీట్ తో సంచలనం సృష్టించడమే కాదు..ఒక్కసారి సాక్షి పేరు అందరి నోళ్ళలో నానింది. హాట్ ఫోటోలు వీడియోలు చూసి తనకు నైటుకు కోటి రూపాయలు ఆఫర్ చేస్తున్న వారు ఉన్నారని.. కానీ తానూ 'సేల్' కి లేనని ఆమె చేసిన ట్వీటే ఈ హంగామాకంతా కారణం.

సాక్షి నటించిన తాజా చిత్రం 'సువర్ణ సుందరి' త్వరలో విడుదలకు సిద్దం అవుతోంది. ఈ కోటి-నైటు ట్వీట్ దెబ్బతో ఆ సినిమాపై అందరి దృష్టి పడింది. కానీ ఇప్పడు మాత్రం ఆ ట్వీట్ ను డిలీట్ చేసేసింది అమ్మడు. రీసెంట్ గా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందుకు వచ్చిన కోటి-నైటు గురించి అడిగితే ఉలుకూపలుకూ లేకుండా ఉండిపోయింది ఈ భామ. అసలు కోటి రూపాయలు ఆఫర్ చేసిన వారు ఎవరని.. ట్వీట్ ఎందుకు డిలీట్ చేశారని అడిగితే సాక్షి సమాధానం చెప్పాడానికి ఇష్టపడలేదు.

దీంతో ఇదో పబ్లిసిటీ స్టంట్ అయి ఉండొచ్చని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. కోటి ఆఫర్ చేసేవాళ్ళు బిగ్ షాట్స్ అయి ఉంటారని.. దాంతో ఒత్తిడితోనే ఆ ట్వీట్ ను డిలీట్ చేసి కిమ్మనకుండా ఉందని కొందరు సాక్షిని వెనకేసుకొస్తున్నారు. ఏదేమైనా సాక్షి స్వయంగా చెప్తేనే నిజాలేవో మనకు తెలిసేది. అప్పటివరకూ ఇలాంటి వెర్షన్లన్నీ ఊహాగానాల కిందే లెక్క.

పూర్తి ఆర్టికల్ ఇక్కడ చూడండి -http://v.duta.us/Dva0iwAA

📲 Get Tollywood on Whatsapp 💬