ప్రభాస్ కోసం బాలీవుడ్ కొరియోగ్రాఫర్స్.. 🕺

  |   Tollywood

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - శ్రద్ద కపూర్ జంటగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం సాహో. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబందించిన ఓ వార్త అభిమానులను తెగ సంబరపెడుతుంది. ఈ చిత్రంలో ప్రభాస్, శ్రద్ద కపూర్ మధ్య మూడు పాటలు ఉన్నాయట. వాటిలో ఒక పాటను బాలీవుడ్ స్టార్ కొరియోగ్రఫర్లు బోస్కో సీజర్ కంపోజ్ చేస్తున్నారట. హిందీ పరిశ్రమలో అనేక మంది స్టార్ హీరోల సినిమాలకు డ్యాన్సులు కంపోజ్ చేసిన వీరు మొదటిసారి టాలీవుడ్ హీరో చిత్రానికి కంపోజ్ చేయడం విశేషం.

యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ చిత్రానికి సంబందించిన గ్రాఫిక్స్ వర్క్ 50 శాతం పూర్తి అయ్యిందట. ఇండియాలోనే భారీ విజువల్స్ తో ఈ సినిమా రాబోతుందని , మే నెలకల్లా చిత్రం యొక్క పూర్తి వర్క్ పూర్తి చేయబోతారని , జూలై నుండి ప్రమోషన్స్ ను మొదలు పెట్టి ఆగష్టు 15న సినిమాను గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. సుజిత్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు .

తెలుగు , హిందీ , తమిళ భాషల్లో భారీ స్థాయిలో విడుదల కానున్న ఈ చిత్రానికి 'రన్ రాజా రన్' ఫేమ్ సుజీత్ డైరెక్ట్ చేస్తుండగా , యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు. శంకర్ ఎహసాన్ లాయ్ సంగీతం అందిస్తున్నారు.

పూర్తి ఆర్టికల్ ఇక్కడ చూడండి -http://v.duta.us/64iCTgAA

📲 Get Tollywood on Whatsapp 💬