ఫోటో స్టొరీ: సిద్దిక.. గంధర్వలోకపు కన్యక! 💃

  |   Tollywood

ఇన్స్టా గ్రామ్ అంటేనే ఫోటోలు.. అందులోనూ అందమైన భామలందరూ ఒక ప్లాట్ ఫామ్ లో ఫోటోలు షేర్ చేస్తూ నెటిజనులను తమ అందాల విందుతో హిమాలయాల అంచులదా..కా తీసుకెళ్తారు. ఆ హీటు తట్టుకోలేక అమాయక నెటిజనులు రాజస్తాన్ థార్ ఎడారిలో నీళ్ళు ఇవ్వకుండా వాకింగ్.. జాగింగ్ చేయించినట్టుగా తెగ ఇదైపోతారు. సాధారణ అందాల భామల ఎగ్జిబిషన్ కే ఈ పరిస్థితి ఉంటే ఈ సిద్దిక శర్మ ఫోటో చూస్తే వాళ్ళు ఎమైపోవాలి?

డౌట్ లేకుండా ఆఫ్గనిస్తాన్ పాకిస్తాన్ బోర్డర్ దగ్గర ఉండే బలూచిస్తాన్ లో ప్రయాణం చేయాల్సి వచ్చిన సాధారణ ప్రయణీకుడిలా గిలగిలా కొట్టుకోవడమే. సంబంధం లేకుండా బలూచిస్తాన్ పేరెందుకు వచ్చిందని చిరాకుపడకండి.. సిద్ధిక శర్మ తన ఇన్స్టా ఖాతా ద్వారా పైన ఉండే ఫోటో పోస్ట్ చేసి "నా ప్రాధాన్యత శాంతి.. సానుకూల దృక్పథం" అని క్యాప్షన్ ఇచ్చింది. మన సప్తగిరి స్టైల్ లో చెప్పుకుంటే "అది కాదమ్మాయ్.. నాకు తెలీక అడగతా ఉన్నా.. నీకు శాంతి.. పాజిటివ్ మైండ్ సెట్ కావాలా. మరి నిన్ను చూసినోళ్ళ పరిస్థితేంది?" అదే కదా ఆమెకు శాంతి.. నెటిజనులకు 'బలూచిస్తాన్' అని మనం అనుకున్నది!

ఇంతకీ ఈ బ్యూటీ పైన ఫోటోలో ఏం చూపిస్తోందో.. మీకేం కనబడుతోందో ఓపెన్ సీక్రెట్ అయినప్పుడు మళ్ళీ దానికి గురించి అదేపనిగా చెప్పుకోవడం ఎందుకు? సిద్దిక గతంలో న్యాచురల్ స్టార్ నాని సినిమా 'పైసా' లో హీరోయిన్ గా నటించింది. టాలీవుడ్ లో బ్రేక్ రాకపోవడంతో నెటిజనుల హృదయాలను బ్రేక్ చేయడమే పనిగా పెట్టుకొని "ఆ రకంగా ముందుకు సాగిపోతూ ఉంది."

పూర్తి ఆర్టికల్ ఇక్కడ చూడండి -http://v.duta.us/0TrzXwEA

📲 Get Tollywood on Whatsapp 💬