ముగిసిన అసెంబ్లీ.. చంద్రబాబు ప్రసంగానికి సభ్యుల స్టాండింగ్ ఓవేషన్ 🙌

  |   Telugunews

టీడీపీ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల చివరి రోజు శుక్రవారం ఓటాన్ అకౌంట్‌పై చర్చకు చంద్రబాబు సమాధానాలు ఇచ్చారు. ఏపీని తిరుగులేని శక్తిగా చేస్తామని, తమను మరోసారి ఆశీర్వదించాలని కోరారు. చంద్రబాబు ప్రసంగం ముగిసిన తర్వాత సభ్యులందరూ లేచి చప్పట్లతో అభినందించారు. విజన్ 1924 ఇచ్చామని, చాలా ఆలోచనలు చేశామని, ఇంకా ఏమైనా ఉంటే సూచనలు చేయాలని సీఎం పిలుపు ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం అన్ని నెరవేరుస్తామన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తిరుగులేని శక్తివంతమైన రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత టీడీపీ ప్రభుత్వం తీసుకుంటుదని చంద్రబాబు స్పష్టం చేశారు. మళ్లీ రాబోయే రోజుల్లో ప్రభుత్వపరంగ ఏం చేయబోతున్నామో విజన్ 1924 ఇచ్చామన్నారు. దీన్ని ఆధారంగా చేసుకుని తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టో కూడా తయారు చేసి ప్రజల ఆశీర్వాదం కోసం వెళతామని ముఖ్యమంత్రి అన్నారు.

పూర్తి ఆర్టికల్ ఇక్కడ చూడండి -http://v.duta.us/YeqbJAAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬