మేనళ్లుల్ల కోసం మెగాస్టార్ 'భరోసా'...! ✋

  |   Tollywood

తన కుటుంభం అంటే మెగాస్టార్ కి చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే తన కుటుంభంలో ఎవరైనా కష్టాల్లో ఉన్నారు అంటే వెంటనే ఆ ఇంటి ముంగిట వాలిపోయి మరీ వారిని ఒడ్డుకు చేర్చే భాద్యతని ఇంటికి పెద్ద దిక్కుగా తీసుకుంటాడు. గతంలో నాగ బాబు ఆరెంజ్ సినిమా విషయంలో చిరు చేసిన సహాయాన్ని ఆయన మాటల్లోనే చాలా సార్లు విన్నాం కదా...అయితే ఇదిలా ఉంటే చిరు పాలిటిక్స్ నుంచి మూవీ రిటర్న్ తర్వాత పూర్తిగా మళ్లీ సినిమా మనిషిగా మారిపోయారు. తన సినిమాలు తాను చేసుకుంటూనే తన కుటుంభ సభ్యుల సినిమా విషయంలో సైతం ఆయన టైమ్ కేటాయిస్తున్నారు.

ఆ మధ్య చెర్రీ 'వినయ విధేయ రామ' షూటింగ్ లో చాలా సార్లు కనిపించారు. ఇక బోయపాటికి కధనంలో కొన్ని మార్పులు కూడా చెప్పారని సమాచారం. ఇక మరో పక్క అటు మేనళ్లుల్ల విషయంలో కూడా చిరు పూర్తిగా ఫోకస్ పెట్టారట. వరుస హిట్స్ తో దూసుకు వచ్చిన సాయి ధర్మ తేజ ఇప్పుడు వరుస ఫ్లాప్స్ లో ఉండడంతో సాయి కరియర్ ను మళ్లీ ట్రాక్ లోకి తీసుకు వచ్చే భాద్యతను చిరు తీసుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం సాయి చేస్తున్న 'చిత్రలహరి' సినిమా కధను విన్న మెగాస్టార్ అందులో కొన్ని మార్పులు చెయ్యమని దర్శకుడికి సూచించినట్లు సమాచారం.

అంతేకాదు చెర్రీతో మాట్లాడి తనకు తెలిసిన నిర్మాతలు దర్శకులు అందరికీ సాయిని సిపార్సు చెయ్యమని సూచించినట్లుగా సమాచారం. ఇక తాజాగా మరో మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇవ్వడంతో ఆ భాద్యతను మన ట్యాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ కి అప్పగించి మంచి హిట్ హీరోగా చెయ్యాలని చెప్పిన విషయం తెలిసిందే. ఏది ఏమైనా చిరు తన కుటుంభం విషయంలో వారి కరియర్ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ద పెడుతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. మరి చిరు కేరింగ్ మెగా మేనళ్లుల్లకి ప్లస్ అవుతుందా? లేదా అన్నది వెయిట్ అండ్ సీ విషయమే. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

పూర్తి ఆర్టికల్ ఇక్కడ చూడండి -http://v.duta.us/KoyBBwAA

📲 Get Tollywood on Whatsapp 💬