రఫేల్ ఒప్పందం: 'ప్రధాని మోదీ రూ.30 వేల కోట్లు దొంగిలించారు.. అనిల్ అంబానీకి ఇచ్చారు' - రాహుల్ గాంధీ 🤔

  |   Telugunews

రఫేల్ ఒప్పందంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూ.30 వేల కోట్లు దొంగిలించారని, ఆ మొత్తాన్ని తన స్నేహితుడు అనిల్ అంబానీకి ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు.దిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాహుల్ మాట్లాడారు.

రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన బేరసారాల చర్చల్లో ప్రధానమంత్రి కార్యాలయం జోక్యం చేసుకోవడాన్ని రక్షణ శాఖ తీవ్రంగా నిరసించిందంటూ 'ది హిందూ' పత్రిక శుక్రవారం నాడు ప్రత్యేక కథనాన్ని ప్రచురించిన నేపథ్యంలో రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.రూ. 60,000 కోట్ల విలువైన రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో రక్షణ శాఖకు సమాంతరంగా ప్రధానమంత్రే స్వయంగా బేరసారాలు చేశారని తేటతెల్లమైందని రాహుల్ గాంధీ అన్నారు.దీనిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ ఒప్పందానికి సంబంధించి ప్రధానమంత్రి, రక్షణ మంత్రి అబద్దాలు ఆడుతున్నారని, వారు సుప్రీం కోర్టుకు కూడా తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపించిన రాహుల్ గాంధీ, ఏకంగా ఇప్పుడు సుప్రీం కోర్టు తీర్పే ప్రశ్నార్థకమైందని అన్నారు."నాకు నిజానికి పరుషమైన మాటలు అనడం ఇష్టం ఉండదు. కానీ, నిజాలు చెప్పాల్సి వచ్చినప్పుడు తప్పడం లేదు. ప్రధానమంత్రి ఒక 'దొంగ' అని చెప్పడం ఇప్పుడు నా బాధ్యత అని రాహుల్ అన్నారు.

రఫేల్ విమానాల కొనుగోలు విషయంలో ప్రధానమంత్రి కార్యాలయం "సమాంతర బేరసారాలు" జరపడాన్ని రక్షణ శాఖ తీవ్రంగా ఆక్షేపించిందని ది హిందూ కథనం తెలిపింది. ప్రధాని కార్యాలయం స్వయంగా బేరసారాలకు దిగడంతో ప్రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు నిక్కచ్చిగా వ్యవహరించలేక బలహీన పడే పరిస్థితి వచ్చిందని, ఆ విషయాన్ని అప్పటి రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్‌ దృష్టికి తెచ్చేందుకు అధికారులు 2015 నవంబర్ 24న ఒక లేఖను పంపించారని ఆ కథనంలో పేర్కొన్నారు.

రఫేల్ ఒప్పందం మీద సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చే నాటికి ఈ పత్రాలు అందుబాటులో లేవు కాబట్టి, ఆ తీర్పు ఇప్పుడు ప్రశ్నార్థకమైందని రాహుల్ అన్నారు. వారు కోర్టుకు అబద్ధాలు చెప్పారు. ఈ పత్రాలు కనుక అందుబాటులో ఉంటే సుప్రీం కోర్టు ఇందులో అక్రమాలు ఏమీ జరగలేదని తీర్పు ఇచ్చేదా అని రాహుల్ ప్రశ్నించారు.రక్షణ మంత్రి అసత్యాలు చెబుతున్నారని చెప్పిన రాహుల్, "ప్రధాని మోదీ స్వయంగా చెప్పడం వల్లే అనిల్ అంబానీని ఎంచుకున్నామని ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఇప్పటికే ఒప్పుకున్నారు" అని చెప్పుకొచ్చారు.

పూర్తి ఆర్టికల్ ఇక్కడ చూడండి -http://v.duta.us/xTHaqQAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬