రూ.5 కోట్లను తిరిగిచ్చేందుకు సిద్ధమైన చెర్రీ 🙏

  |   Tollywood

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వాని జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'వినయ విధేయ రామ'. ఈ చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది. బయ్యర్లకు భారీ నష్టాన్ని తెచ్చిపెట్టింది. ఈ సినిమా ఫ్లాప్ అయిన విషయాన్ని ఒప్పుకుంటూ చెర్రీ అభిమానులకు లేఖ కూడా రాసిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు డీవీవీ దానయ్య నిర్మాణ సారథ్యం వహించారు.

అయితే ఈ సినిమా కారణంగా బయ్యర్లు రూ.30 కోట్ల వరకూ నష్టపోయారని టాక్. వాళ్ల నష్టాన్ని కొంతవరకైనా తగ్గించవలసిన బాధ్యత తమపై ఉందనే అభిప్రాయాన్ని చెర్రీ.. దానయ్య వద్ద వ్యక్తం చేశాడట. దీంతో ఇద్దరూ కలిసి రూ.15 కోట్లను నష్ట పరిహారం కింద తిరిగిచ్చేందుకు సిద్ధమయ్యారని ఫిలింగనర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే చెర్రీ తన పారితోషికం నుంచి రూ.5 కోట్లను తిరిగి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం. మిగిలిన రూ.10 లక్షలను దర్శక, నిర్మాతలు చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.

పూర్తి ఆర్టికల్ ఇక్కడ చూడండి -http://v.duta.us/Cyg2ygAA

📲 Get Tollywood on Whatsapp 💬