వైయస్ఆర్ ‘యాత్ర’ ప్రివ్యూ టాక్..ఎలా ఉందో తెలుసా..👌

  |   Tollywood

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా ‘యాత్ర’ సినిమా తెరకెక్కుతోంది. ‘ఆనందో బ్రహ్మ’ ఫేమ్ మహి.వి.రాఘవ్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో వైయస్ఆర్ పాత్రలో మలయాళ మెగా స్టార్ మమ్ముట్టి నటించాడు. ఇప్పటికే యూఎస్‌‌తో పాటు ఓవర్సీస్‌లో విడుదల ‘యాత్ర’కు విశేష స్పందన వస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను 970 స్క్రీన్స్‌లో విడుదల కానుంది.

దివంగత వై.యస్.రాజశేఖర్ రెడ్డి పాత్రలో మమ్ముట్టి అద్భుతంగా ఒదిగిపోయాడని చెప్పుకుంటున్నారు. ఈ సినిమా మొత్తాన్నిఎమోషన్‌ను బేస్ చేసుకొని తెరకెక్కించారట. ఆయా సన్నివేశాలకు ఆడియన్స్ కనెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట.

ముఖ్యంగా కాంగ్రెస్ అధిష్టానంతో వైయస్ఆర్ ఎలా వ్యవహరించేవారే ఈ సినిమాలో చక్కగా చూపించారు. మాట ఇస్తే ఎవరినైనా ధిక్కరించే నైజాన్ని ఈ చిత్రంలో ఆవిష్కరించారు.మొత్తానికి ఈ సినిమా హెలికాప్టర్ ప్రమాదంలో వైయస్ఆర్ చనిపోయే సన్నివేశాలు హైలెట్ అని చెబుతున్నారు. మొత్తంగా వైయస్ఆర్ అభిమానులకు ఖచ్చితంగా నచ్చే సినిమా అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్, ఏపీలో అధికారంలో ఉన్న తెలుగు దేశం పార్టీకి పూర్తి వ్యతిరేకంగా ఈ సినిమాను తెరకెక్కించారు. మహి.వి.రాఘవ టేకింగ్ బాగుందనే మాటలు వినిపిస్తున్నాయి. ఫోటోగ్రఫీ,నిర్మాణ విలువలు బాగున్నాయి.

పూర్తి ఆర్టికల్ ఇక్కడ చూడండి -http://v.duta.us/QWzsoQAA

📲 Get Tollywood on Whatsapp 💬